BJP fails to make mark in Kerala local body elections కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ విజయం

Kerala local body election results 2020 advantage ldf udf follows bjp fails

Kerala local body election, kerala election results, kerala local election results, kerala local body election result 2020, kerala election 2020, thiruvananthapuram corporation result, kozhikode corporation result Local body elections, gram panchayat elections, muncipality elections, corporation elections, UDF, LDF, BJP, Kerala, Politics

The results from the local body elections in Kerala have firmly placed the CPM-led LDF in the driving seat with wins in more than 500 of the 941 gram panchayats, four of the six corporations, 10 of the 14 district panchayats and 112 of the 152 block panchayats. Only in the case of municipalities has the LDF conceded an edge to the UDF.

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ విజయం

Posted: 12/16/2020 10:55 PM IST
Kerala local body election results 2020 advantage ldf udf follows bjp fails

కేరళలో అధికార వామపక్ష పార్టీల కూటమి ఎల్డీఎప్ కు ప్రతిపక్ష యూడీఎప్, ఎన్డీయే పార్టీలకు మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమి తన సత్తాను చాటింది, మరో ఏడాదిలో కాలంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రజల్లో తమ బలం చెక్కుచెదరలేదని మరోమారు వామపక్ష పార్టీలు నిరూపించుకున్నాయి. అయితే పట్టాణాల్లో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సత్తా చాటింది. గ్రామపంచాయితీ, కార్పోరేషన్లు, బ్లాక్ పంచాయత్ లలో అధికార పార్టీ తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యంగా యూడీఎఫ్ కంచుకోటగా వున్న జిల్లాలోనూ ఎల్డీఎఫ్ చోచ్చుకెళ్లింది.

అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతున్న బీజేపి మాత్రం ఇక్కడ తమ మార్కు రాజకీయం చేసినా.. ఏలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కేరళలో కమల దళం అశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. ఎన్డీయే నామమాత్రపు ప్రభావంతోనే మిగిలింది. ఈ నెల 8, 10, 14 తేదీలలో మూడు విడుతలుగా జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలోని 941 గ్రామపంచాయితీలతో పాటు 15,962 వార్డులకు, 152 బ్లాక్ పంచాయితీలతో పాటు 2080 బ్లాక్ వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు 14 జిల్లా పంచాయితీలతో పాటు 331 డివిజన్లకు, 86 పురపాలక సంఘాలతో పాటు వాటి పరిధిలోని 3078 వార్డులకు, వీటితో పాటు ఆరు మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికలలో 76శాతం ఓట్లర్లు తమ తీర్పును ఇచ్చారు.

కాగా ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలను అక్కడి ప్రభుత్వం, ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం యంత్రాలనే వినియోగించారు. ఇక ఎన్నికలలో ఎల్డీఎఫ్ తమ సత్తాను చాటింది. 941 గ్రామపంచాయితీలలో అధికార పార్టీ 500 కైవసం చేసుకోగా 441 పంచాయితీలను యూడిఎఫ్ కైవసం చేసుకుంది. ఆరు కార్పోరేషన్లలో నాలుగింటిని దక్కించుకుంది. ఇక 14 జిల్లా పంచాయితీల్లోనూ పదింటిని అదిమిపట్టుకుంది. అటు 152 బ్లాక్ పంచాయితీల్లో 112 బ్లాక్ పంచాయితీలను కూడా గెలుపోందింది. ఎల్డీఎఫ్ అధిపత్యం చాటే త్రిస్పూర్, ఎర్నకుళం, కోట్టాయం జిల్లాల్లోనూ ఎల్డీఎఫ్ బలాన్ని పెంచుకుంది. ఎన్డీయే 25 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 37 చోట్ల ముందంజలో ఉన్నారు. మునిసిపాలిటీల విషయానికి వస్తే, 86 స్థానాలకు గాను యూడీఎఫ్ 39, ఎల్డీఎఫ్ 38, ఎన్డీయే 3, ఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

పట్టణ ప్రాంతాల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. కాగా, ఒక్క ఓటుకు ఉన్న విలువ అటల్ బిహారి వాజ్ పాయ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన విషయం తెలిసిందే. తాజాగా అదే ఒక్క ఓటు విలువను చాటిచెప్పే సంఘటన మళ్లీ కేరళలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ వార్డు నుంచి పోటీ చేసిన వేణుగోపాల్ కు ఈ అనుభవం ఎదురైంది. ఆయనపై బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచి విజయం సాధించారు. దీంతో తన ఓటమికి ఈవీఎం యంత్రమే కారణమని నెపాన్ని దానిపై తోసివేశారు వేణుగోపాల్. ఓటమిపై న్యాయపోరాటం చేసే విషయంలో తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలుసుకున్న అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh