Ban on parties, gatherings.. night curfew in AP న్యూఇయర్ ను కర్ఫ్యూతో ఆహ్వానం.. జనవరి 2 వరకు ఆంక్షలు

New year 2021 parties social gatherings banned in andhra pradesh due to covid 19

new year celebrations, liquor shops, curfew, second wave, jan 15 to march 15, mystery illness, coronavirus, lockdown, Covid second wave, corona symptoms, coivd-19, India, Health, epidermic, Andhra Pradesh

Amid the rising coronavirus cases in the country, the New Year 2021 celebrations including social gatherings and parties have been banned in several cities across India. These bans will remain in place in those cities which are already under night curfew to curb the spread of the COVID-19.

న్యూఇయర్ ను కర్ఫ్యూతో ఆహ్వానం.. జనవరి 2 వరకు ఆంక్షలు

Posted: 12/16/2020 10:15 PM IST
New year 2021 parties social gatherings banned in andhra pradesh due to covid 19

కరోనా మహమ్మారి విజృంభనతో భయాందోళనకు గురైన దేశవాసులలో టీకా వస్తుందన్న ఆశలు అంధోళనలను దూరం చేస్తున్నా.. అప్పటివరకు మాత్రం జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే. అన్ని వర్గాల ప్రజలు ఈ జాగ్రత్తలను పాటిస్తూనే వాక్సీన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు కూడా అనునిత్యం జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు, ఇప్పటికే అన్ లాక్ 5.0 నిబంధనల పోడగింపు కూడా పూర్తికావడంతో రమారమి జనజీవనం పూర్తిగా యధతధస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో సెకండ్ వేవ్ వస్తుందంటూ అందోళనలు విస్తృతం కావడంలో మళ్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, ఈ క్రమంలో వాక్సీన్ వచ్చేంతవరకు ప్రజలందరూ జాగ్రత్తగా వుండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

శీతాకాంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ (రెండో తాకిడి) తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే శీతల దేశాల్లో ఈ తాకిడి కూడా ప్రారంభమైంది. ఇటు దేశరాజధాని ఢిల్లీలోనూ కరోనా సెకండ్ వేవ్ తాకిడి మొదలైందని వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ ఏడాది న్యూఇయర్ వేడుకలకు పలు రాష్ట్రాలు దూరంగా వుండనున్నాయి. రాష్ట్రాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఈ వేడుకలకు దూరంగా వుండాలని ప్రభుత్వాలు అదేశిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్థరాత్రి వేడుకలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి, లేట్ నైట్ పార్టీలు, వేడుకలకు దూరంగా ఉంచేందుకు పలు ప్రభుత్వాలు కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నాయి.

ఈ ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు జరగనున్నాయి. 2021 నూతన సంవత్సరాన్ని ఏపీ ప్రభుత్వం కూడా కర్ప్యూతో ఆహ్వానించనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. ముఖ్యంగా, కొత్త సంవత్సరాది నేపథ్యంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఈ రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా కుదించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గినా, జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి ప్రజ్వరిల్లే అవకాశం ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new year celebrations  liquor shops  curfew  second wave  jan 15 to march 15  Andhra pradesh  

Other Articles