గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ తొలిరౌండ్ కోనసాగుతోంది. ఈ ఫలితాలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి-బీజేపికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇప్పటికీ బీజేపి పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీపై 70 స్థానాల్లో అధిక్యం సంపాదించుకోగా, టీఆర్ఎస్ మాత్రం ముఫై ఐదు స్థానాల్లో అధిక్యాన్ని కోనసాగిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎంఐఎం పార్టీ కూడా మొత్తంగా 21 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు స్థానాల్లో అధిక్యంలో వుంది, నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో బీజేపి తన అధిపత్యాన్ని ప్రదర్శింస్తోంది.
కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం రామచంద్రాపురం, చందానగర్, పటాన్ చెరువు, హఫీజ్ పేట్, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, రంగారెడ్డి నగర్ వార్డుల్లో దూసుకెళ్తోంది. ఇక గచ్చిబౌలి, మాదాపూర్ సహా అనేక వార్డులలో బీజేపి అధికార పార్టీకి గట్టిపోటీనిస్తోంది. అయితే అది నుంచే ఈ రెండు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా వున్న పోటీ.. రౌండ్లు పూర్తవుతున్న కోద్ది మరింత జఠిలంగా మారవచ్చునని.. దీంతో బల్దియా పీఠంపై ఎవరు అధిపత్యం కోనసాగుతుందన్న ఉత్కంఠ మాత్రం ఇప్పటికీ పార్టీల మధ్య కొనసాగుతోంది.
మెహదీపట్నం డివిజన్ ఫలితం ముందస్తుగా విడుదల అవుతుందని వచ్చిన అంచనాల నేపథ్యం కరెక్టయ్యింది. ముందుగా ఈ డివిజన్ పూర్తి ఫలితం వెలువడింది. ఈ డివిజన్ లో మజ్లిస్ పార్టీ తన విజయాన్ని నమోదు చేసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికలలో బోణి కోట్టింది. ఇక్కడి నుంచి ఎంఐఎం పార్టీ తరపున బరిలో నిలిచిన మహమ్మద్ మజీద్ హుస్సేన్ మరోమారు విజయాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీలో డిఫ్యూటీ మేయర్ గా సేవలు అందిస్తున్న ఆయన మరోమరు తన సమీప ప్రత్యర్ధి బీజేపి అభ్యర్థి డి.గోపాల్ కృష్ణపై విజయం సాధించారు, ఇక మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య గ్రేటర్ ఫీఠంపై పూర్తి అంచనాలు వెలువడనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 18 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోమారు పరాభవం ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని అమె తరపున... Read more
Jan 18 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల కమీషన్ మ్రోగించిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్డును... Read more
Jan 18 | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు తెలుగు ప్రజల ఇలవేల్పుగా కొంగుబంగారమైన విషయం తెలిసిందే. కాగా, తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ముందు భక్తులు ముందుగా వరహామూర్తి దేవాలయంలో ఆయన దర్శనం చేసుకోవాలన్న నానుడి... Read more
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more