తెలంగాణలో కరోనా మహమ్మారి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదైన తరుణంలో అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోన్న ప్రభుత్వం.. క్రమేపి కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా తగ్గింది, దీంతో తాజాగా నమోదైన కరోనా కేసుల సంఖ్య ఏకంగా 2.67 లక్షల మార్కుకు చేరువలో వుంది. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణలో 1000 మార్కుకు చేరువలో వుండటం అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో ఇప్పటికే తెలంగాణ పదవ రాష్ట్రంలో నమోదు చేసుకుంది. ఈ తరుణంలో ప్రతి రోజు మరణాలు నమోదు కావడం కూడా అంధోళనకర అంశమే. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి.
తెలంగాణలో మే నెల 7 నుంచి కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ, తాజగా గత నెల రోజుల వ్యవధి నుంచి కాసింత తగ్గుముఖం పట్టాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిందని.. అన్ లాక్ నేపథ్యంలో తమ బతుకుబండి కూడా నడిపించుకోవాలని హైదరాబాదీయులు బయట తిరుగుతున్నారు. దాదాపు ఏడు మాసాలకు పైగా ఇళ్లకు మాత్రమే పరిమితం అయిన నగరవాసులు ఇక తమ వ్యవహారికాలను చూసుకుంటున్నారు. మాస్క్ లు ధరించడం.. శానిటైజర్ ను వినియోగించడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే కోందరు జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో అత్యధిక కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. ఇక గత పక్షం రోజులుగా 15 వేల కేసులు తెలంగాణలో నమోదయ్యాయి.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 862 మార్కుకు దిగువనే నమోదు కావడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 164 కేసులు నమోదు కావడంతో నగరవాసుల్లోనూ ఆందోళనకు దారి తీస్తోంది. అయితే సెకండ్ వేవ్ వస్తుందన్న సంకేతాలను ప్రభుత్వం వెలువరించడం.. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనుండటంతో నగరవాసుల్లో కరోనా పట్ల కొంత అందోళన చెందుతున్నారు. గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు గత వారం రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి, దీంతో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా రెండు లక్షల 66 వేల మార్కును అధిగమించి కేసులు నమోద అవుతున్నాయి, దీంతో ఈ స్థాయిలో కరోనా కేసుల నమోదు చేసుకున్న 9వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో కేసులు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 164ల మార్కుకు చేరువలో కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.
అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో పంజా విసురుతున్న కరోనా.. ఇక జిల్లాల్లోనూ తన ఉద్దృతిని చాటుకుంటోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 2.66 లక్షల మార్కును అధిగమించింది, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ ముగ్గురు అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1444 కు చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఉగ్రరూపం దాల్చిన కరోనా కేసులు గత పక్షం రోజులుగా కాసింత తగ్గుముఖం పట్టినా మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా ఇవాళ నమోదైన 862 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 2,66,904 కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 164 కేసులు నమోదుకాగా, ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే అదిలాబాద్ జిల్లాలో 4, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 53, జగిత్యాలలో 24, జనగాంలో 4, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11, జోగులాంబ గద్వాల జిల్లాలో 4, కామారెడ్డి జిల్లాలో 9, కరీంనగర్ జిల్లాలో 38, ఖమ్మం జిల్లాలో 63, కుమ్రంభీం అసిపాబాద్ జిల్లాలో 7, మహబూబ్ నగర్ జిల్లాలో 15, మహబూబ్ బాద్ జిల్లాలో 8, మంచిర్యాల జిల్లాలో 26, మెదక్ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి.
ఇక మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 91, ములుగు జిల్లాలో 11, నగర్ కర్నూల్ జిల్లాలో 10, నల్గోండ జిల్లాలో 35, నారాయణ పేట్ 8, నిర్మల్ జిల్లాలో 2, నిజామాబాద్ 13, పెద్దపల్లి జిల్లాలో 37, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10, రంగారెడ్డి జిల్లాలో 57, సంగారెడ్డిలో 27, సిద్దపేట జిల్లాలో 2, సూర్యాపేట జిల్లాలో 28, వికారాబాద్ జిల్లాలో 8, వనపర్తిలో 11, వరంగల్ రూరల్ జిల్లాలో 12, వరంగల్ అర్భన్ జిల్లాలో 33, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 కేసు నిర్థారణ అయ్యింది, కరోనా బారినపడి కోలుకొన్న 961 రోగులను అధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తంగా 2,52,565 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,784 యాక్టివ్ కేసులు వున్నాయని, ఇక హోమ్ ఐసోలేషన్ లో 8,507 మంది చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more