(Image source from: Jagran.com)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా జరుగుతున్నాయి, గత పర్యాయం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు అధికార పార్టీకి నల్లేరుపై నడకలా సాగినా, ఈ పర్యాయం మాత్రం బీజేపి పార్టీ నుంచి గట్టి పోటీనే ఎదుర్కోంటోంది. దుబ్బాక ఉపఎన్నిక అందించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బీజేపి కూడా దూసుకుపోతోంది. ఈ నెల 3న జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార పార్టీతో నువ్వానేనా అన్నట్లు పోటీ ఏర్పడినా.. 10వ తేదీని విడుదలైన ఫలితాలలో మాత్రం బీజేపి పైచేయి సాధించింది. దీంతో బీజేపి కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ తామ పార్టీకి విజయాన్ని అందించాలన్న కృతనిశ్చయంతో ఉత్సాహంగా ప్రచారంలో దూసుకుపోతోంది.
ఇప్పటికే బీజేపి రాష్ట్ర స్థాయి నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలను అకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు యువనేతలు ఎంపీ ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాజాసింగ్, లక్ష్మణ్, రామచంద్రారెడ్డి సహా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణతో పాటుగా పలువురు నేతలు ప్రచారంలో దూసుకెళ్తుండగా, బెంగళూరు బీజేపి ఎంపీ, బీజేపి యువమోర్చా జాతీయ నేత తేజస్వీ సూర్య కూడా రాష్ట్ర నాయకులతో పాటు ప్రచారంలో పాలుపంచుకుంటూ యువతను, ఓటర్లను తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు, ఇక ఈ ఎన్నికలలో తమ విజయాన్ని చాటితే దీనిని చూపి రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఇంతకు మించిన పోటీని ఇచ్చి.. రాష్ట్రంలో అధికారాన్ని కూడా అందుకోవాలని బీజేపి జాతీయ స్థాయి నేతలు వ్యూహరచన చేస్తున్నారు.
ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపి జాతీయ స్థాయి నాయకులకు కూడా నిర్ణయాత్మకంగా మారాయి, దీంతో ఈ ఎన్నికల ప్రచారానికి బీజేపి పలువురు జాతీయ నేతలను రంగంలోకి దింపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీహెఛ్ఎంసీ ఎన్నికలలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు, వీరితో పాటు మరికొంతమంది అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక వీరి హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను మాజీ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన భూపేంద్ర యాదవ్ ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచనలు చేస్తోన్న విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినా.. లేక రెండో స్థానంలో నిలిచినా తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణులలో నూతనోత్సాహం వస్తుందని, దీంతో వారు రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత జోష్ తో పనిచేసిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అస్కారం అధికంగా వుందని బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇందుకు అనుగూణంగా తెలంగాణలో కాంగ్రెస్ లోని ప్రముఖ నేతలను తమ పార్టీలో కలుపుకోవడం కూడా వ్యూహంలో భాగమేనని వార్తలు వినిపిస్తున్నాయి, ఇప్పటికే మాజీ ఎంసీ సర్వే సత్యనారాయణ బీజేపిలో చేరగా, ఇక జేపి నడ్డా ఆద్వర్యంలో విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. అయితే అమె పార్టీలో చేరిన తరువాత అమె కూడా జీహెఛ్ఎంసీ ఎన్నికలలో బీజేపి తరపున ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more