Nara Lokesh adopts a new style of functioning విజన్, మిషన్ కలిగిన ఆశాకిరణం.. నారా లోకేష్..

Nara lokesh turns the new ray of hope with clear vision and mission

Nara Lokesh, TDP Leader, Nara lokesh vision, Nara Lokesh Mission, Nara Lokesh TDP, Nara Lokesh party Leaders, Nara Lokesh Party, YSRCP party, YS Jagan, Andhra Pradesh, Politics

TDP General Secretary Nara Lokesh has changed a lot and his new style of functioning is winning the hearts of the leaders. The elections in the state are not near but Lokesh continued to stay in the people when most of the senior leaders and supporters of TDP are idle. The Young Leader did not have a smooth sail in politics. He was trolled, criticized badly during his initial days and he was even blamed for the defeat of the party in the 2019 polls.

రామన్న రాజకీయ చతురత.. చంద్రన్న దీక్షాదక్షతతో దూసుకెళ్తున్న నారా లోకేష్..

Posted: 11/23/2020 03:58 PM IST
Nara lokesh turns the new ray of hope with clear vision and mission

టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఆశాకిరణంగా ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు నాయకులకు కనిపిస్తున్నారు, రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారిన ఆయన ఇటు పార్టీ నేతలతో పాటు అటు ప్రజల్లో కూడా దూసుకెళ్తున్నారు. రామన్న (ఎన్టీ రామారావు) రాజకీయ చతురతతో పాటు చంద్రన్న(చంద్రబాబు) దీక్షాదక్షతలను పునికిపుచ్చుకుని పార్టీ శ్రేణులలో నూతన జవసత్వాలు నింపేందుకు కృషిచేస్తున్నారు. నారా లోకేష్ లో కనిపిస్తున్న మార్పులు.. ఆయన వ్యవహార శైలిని నిషితంగా గమనిస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆయనను అడుగడుగునా టార్గెట్ చేస్తున్నారు, లాక్ డౌన్ సమయంలో ఆయన ఒక్కసారిగా తన వ్యవహారశైలిలో మార్పును సంతరించుకోవడంతో అపోజిషన్ పార్టీలలో అటెన్షన్ మొదలైంది.

అసెంబ్లీ ఎన్నికల నాటి వరకు ఆయన తప్పులను లెక్కించడమే పనిగా పెట్టుకుని విమర్శలను గుప్పించిన నేతలు.. తాజాగా అయన ప్రసంగాలలో పదునైన వాగ్ధాటి.. సమస్యలపై ఆయన పాలకపక్షాన్ని ప్రశ్నిస్తూ సంధిస్తున్న తీరు.. ఆధికార పక్ష నేతలను అధికార దుర్వినియోగంపై.. దౌర్యన్నాలపై., ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన టార్గెట్ చేస్తున్న విధానంపై రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నారా లోకేష్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రామన్న రాజ్యాన్ని, చంద్రన్న సంక్షేమాన్ని ప్రజలకు అందించడం ఖాయమంటున్నాయి రాజకీయ పరిశీలకుల అభిప్రాయాలు. అయితే నారా లోకేష్ రాజకీయ దృక్పథం, వాగ్ధాటి ఇంతలా మార్పు చెందడానికి.. ఆయనను సమకాలని పరిపూర్ణ రాజకీయ నేతగా పరిణితి చెందడానికి ఒక రకంగా ప్రస్తుత పాలక పక్ష పార్టీయే కారణం.

Nara Lokesh News

సరిగ్గా రాష్ట్ర విభజన సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్.. వచ్చి రావడంతోనే అటు టీఆర్ఎస్, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నేతల విమర్శలకు కేంద్రబింధువయ్యారు. విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసింగి, అక్కడి విశ్వవిద్యాలయాలలో ఎంబీఏ పట్టాను అందుకుని దేశానికి వచ్చిన ఆయనకు ఇక్కడి వాతావరణాన్ని.. రాజకీయాలను అందుకోవడానికి కోంత సమయం అవసరం అయినా.. ఆయన అందుకు భిన్నంగా వెంటనే తన తండ్రితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేసినా.. తన వ్యాఖ్యలను, పదాలను కూడా తప్పబడుతూ విమర్శలు సంధించినా.. మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోన్నారు. తనపై ప్రత్యర్థులు సంధించిన ప్రతీ విమర్శకు ఆయన అంతే ధీటుగా అన్ని కోణాలలోనూ పరిణితి చెందారు.

రాష్ట్ర విభజన అనంరతం ఈ విమర్శలు మరింత పదునెక్కాయి, అయితే టీఆర్ఎస్ నుంచి కాకుండా రాష్ట్రంలోని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఈ విమర్శల జడిని కొనసాగించాయి, యువనేత టీడీపీ పార్టీలో క్రీయాశీలకంగా మారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే ప్రారంభమైన పరాభవాలు.. విమర్శలు.. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత శృతిమించాయి. ఆయన వెళ్లిన ప్రతీ చోటకు ప్రత్యర్థి మీడియా తప్పకుండా హాజరై ఆయన ప్రసంగంలో తప్పిదాలనే.. పెద్ద తప్పిదాలుగా చూపించింది. ఇక ఆయన రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృధ్ది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విమర్శలను పతాకస్థాయికి చేరుకున్నాయి, ఆయనను అసలు పరిగణలోకి తీసుకునేందుకే వీలు లేని నాయకుడిగా ప్రత్యర్ధి పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఆయనను మానసికంగా కుంగదీసేందుకు కుయుక్తులు పన్నారు.

Nara Lokesh TDP Plans

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో టీడీపీ పార్టీ ఘోర పరాజయానికి కూడా నారా లోకేష్ మూల కారణమని, ఆయన రాష్ట్రంలోని టీడీపీ ఇలాకాగా పేర్కోనే అన్ని నియోజకవర్గాలు తిరిగి చివరకు మంగళగిరి స్థానానికి వచ్చారని, అక్కడ కూడా ఆయన ఓటమి తప్పలేదని విమర్శలు చేశారు. ఆయన మూలంగానే ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యిందని కూడా విమర్శలు గుప్పించారు. అయినా లోకేష్ కుంగిపోలేదు. ప్రత్యర్థుల విమర్శలతో రాటు తేలుతూ.. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ ప్రస్తుతం పరిణితి చెందిన పరిఫూర్ణ రాజకీయ వేత్తగా ఎదిగాడు, తన హుందాతనాన్ని కాపాడుకుంటూనే.. మనోధైర్యంతో విమర్శలను ఎదుర్కోన్నారు. ఒక్కరి విమర్శలతో తన ప్రతిష్ట దిగజారిపోయేది కాదని, తన క్యాపబిలిటీ చేతల్లోనే చూపించాలని.. నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగి.. ఒక్కోక్క మెట్టు అధిరోహిస్తున్నారు.

ఎంతటి వటవృక్షమైనా మొక్క దశను దాటాలని తెలిసిన ఆయన.. విపక్ష పార్టీల విమర్శలతో.. ఆటుపోట్లతో మరింత ధృడంగా తయారైయ్యారు. పార్టీ శ్రేణులను తనవైపు అకర్షించుకునేందుకు తన తాత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయ చతురతను కూడా అవసోసన పట్టినట్టు కనిపిస్తున్నారు లోకేష్. అంతేకాదు తన తండ్రి దీక్షా, దక్షత, క్రమశిక్షణ కూడా అందుకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా తొలుత కొంత బొద్దుగా వుండే నారా లోకేష్ లాక్ డౌన్ సమయంలో అన శరీర ఆకృతిని మార్చుకుని పుల్ ఫిట్ గా కనిపిస్తున్నారు, అటు పార్టీలో సీనియర్ నేతల నుంచి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అగ్రనేతలందరినీ కలుపుకుని ఒక్కోక్క అడుగు ఆచితూచి వేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రతీ అంశాన్ని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. పాలక పక్ష పార్టీకి చెందిన నేతల అడగాలను, ఎప్పకప్పుడు తూర్పారబడుతూ సామాజిక మాద్యమంలో తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.

Nara Lokesh

పార్టీలో ఆయన తనదైన ముద్ర వేసుకునేందుకు.. ఆయన అకుంఠిత దీక్షే కారణం. నారా లోకేష్ పార్టీలోకి రావడంతో తొలుత ఆయనకు పార్టీ బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. దీంతో ఆయన పార్టీలోని పేద కార్యకర్తలు, నాయకులతో పాటు పార్టీ కోసం ప్రాణాలను అర్పించిన నేతల బిడ్డలకు విద్యాను అందించే బాధ్యతను అందుకున్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న పార్టీ క్రీయాశీలక కార్యకర్తలు, పేద విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద విద్యను అందిచారు, ఫాక్షన్ గోడవల్లో ప్రాణాలు పోయి అనాధలుగా మారిన కార్యకర్తల సంతానంతో పాటు పలు కారణాలతో అనాధులుగా, వితంతువులుగా మారిన వారందరికీ ఆర్థిక సాయం అందిస్తూ స్వయం ఉఫాధి, వృత్తి శిక్షణలను నేర్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చర్యలు తీసుకున్నారు. రక్తదాన శిభిరాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి హోదాలను చేపట్టినా.. పార్టీలోని సీనియర్ లీడర్లతో సమ్మేళితమై వారితో చక్కని సంబంధాలను ఏర్పర్చుకున్నారు. సీనియర్లకు మర్యాదను ఇస్తూనే తన దృక్పధాన్ని పార్టీ ముందు, ఇటు క్యాబినెట్ ముందు పెట్టిన మంత్రి ఆయన. తన కోణం.. పార్టీని ముందుకు నడిపించే ఆలోచనలు అన్నింటికీ పదనుపెట్టాడు. అటు మహానాడు ఇటు మహావేదికల ద్వారా చంద్రబాబు కేంద్రానికి, ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీకీ బదులు చెబుతూనే పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన తరుణంలో.. పార్టీ నాయకులను ఏకతాటిపై నడిపించి.. బాధ్యతను ఆయన తెరవెనుకే చేపట్టిన విషయం తెలిసిందే, పార్టీని మరింత దృడంగా నడపించే బాధ్యతను కూడా ఆయన చేపట్టారు, ఇలా తన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, శ్రయోభిలాషులతో పాటు అందరికీ తానున్నానన్న ధైర్యాన్ని అందించాడు,

Nara Lokesh Pictures

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు చాలా మంది ఓటమిని చవిచూడాల్సివచ్చింది. మంగళగిరి నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ కూడా ఓటమిపాలయ్యారు. అందుకు అధికార పక్షంతో పాటు తన సోంత పార్టీలోని పలువురు నేతలు కూడా నారా లోకేష్ నాయకత్వాన్ని తప్పుబడుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. అయినా వారిపై ఎలాంటి విమర్శలు, అరోపణలు చేయకుండా మిన్నకుండిన యువనేత.. తన టీడీపీ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న మిషన్ చేపట్టారు. రాష్ట్ర అభివృద్ది కూడా విజన్ ను ఏర్పర్చుకున్న ఆయన అటు పార్టీని, ఇటు రాష్ట్ర ప్రగతిని జోడెడ్లుగా ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించారు, రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకురాగల సత్తా తమ టీడీపీ పార్టీకే వుందని, అదే సమయంలో చంద్రన్న హయంలో అమలుపర్చిన సంక్షేమ పథకాలను అందించే దిశగా కూడా ఆయన దృష్టి సారించారు,

రాష్ట్రంలో ప్రస్తుత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, బడుగు, బలహీనవర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల వెనకనున్న మతలబును ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఏక్ హాత్ సే దేనా.. దుసెరే హాత్ సే లేనా అన్న (ఓ చేత్తో ఇస్తూనే మరో చెత్తే తీసుకునే) విధానాన్ని అవలంభిస్తోందని అరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా నిర్మాణలను చేపడుతూ.. కోత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రారంభమవుతుందని కానీ రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేతలు, రివర్స్ టెండర్లతో ప్రారంభమై.. వెనక్కు పరుగులు తీస్తోందని ప్రభుత్వంపై సునిశిత విమర్శలు సంధిస్తున్నారు. వైసీపీ నేతల ఆగడాలు, అరచాకాలు ఎక్కడ ఎదురైనా ఆ బాధితులకు ఆయన దగ్గరవుతూ తన పార్టీ స్థానిక నేతలతో వారికి అండగా నిలబడేలా చేస్తున్నారు.

Nara Lokesh AP Tour

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా మూడున్నరేళ్ల సమయం వున్నా.. ఆయన ఇప్పట్నించే అన్ని రకాలుగా పార్టీని సమరక్షేత్రంలో నిలిపేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల నేతలను కలుస్తూ.. వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆయా వర్గాల ప్రజలను టీడీపీ పార్టీవైపు అకర్షించడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. అటు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కూడా ఆకర్షించేందుకు ఆయన వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కుల సంఘాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ.. కులాలవారీగా కూడా అకర్షించే చర్యలకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు, ఇలా అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్ని విధాలుగా తాము ప్రత్యర్ది పార్టీలను, ఆ పార్టీల నేతలను ఎదుర్కోనేందుకు సమాయత్తం అవుతున్నారు.

ఈ తరుణంలోనే నారా లోకేష్ కూడా తన తండ్రి బాటలో పయనించేందుకు సిద్దం అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు పాదయాత్రలు నిర్వహించారు. అయితే ఆ తండ్రిని మించిన తనయుడిగా.. రాజకీయ దిగ్గజ నేత వారసుడిగా ఈ యువనేత రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేని తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల హామీలపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ.. నవరత్నా హామీలు.. నవ్వితే నవ్వు రత్నాలు అన్నట్టుగా మారాయని తూర్పారబట్టేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో పాదయాత్ర నిర్వహించేందుకు సన్నధం అవుతున్నారు. ఈ సమయంలో అధికార పార్టీ నేతలు అక్కడి స్థానికులపై ఎలా తమ అధిపత్యాన్ని ప్రదర్శిస్తోందో కూడా ఆయన చాటనున్నారు, సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజాస్వామ్యబద్దంగా నారా లోకేష్ వేస్తున్న అడుగులు అధికార పార్టీకి శరాఘాతంలా తయారయ్యే అవకాశాలు వున్నాయి, ఇదే తరహాలో యువనేత తన జోరును కోనసాగిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పూర్వవైభవాన్ని అందుకోవడం అతిశయోక్తి కాదన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

Nara Lokesh Politics

నారా లోకేష్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కొన్ని ఘటనలు:

 

Nara Lokesh future plans

అధికార పార్టీ నేతలు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసు కేసులు బనాయించడం, బౌతిక దాడులకు దిగడం వంటివి చేయడంతో.. ఆయన వాటిపై కన్నెర చేశారు. గుంటూరులో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్న క్రమంలో ఛలో ఆత్మకూరు చేపట్టిన నారా లోకేష్ ను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు, పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ వర్గాల దౌర్జన్యం ఎక్కువైందని ఈ గ్రామంలోని తమ కార్యకర్తలను అధికార వర్గానికి చెందిన వ్యక్తులు, పోలీసుల దౌర్జన్యాన్ని తట్టుకోలేక ఇళ్లు వదిలి వచ్చేశారని.. అయన వారికి అభయమిస్తూ పోరాటానికి సన్నదమై ఛలో అత్మకూర్ కు పిలుపునివ్వగా పోలీసులు ఆయనతో పాటు టీడీపి నేతలను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు, ఇక రాష్ట్రం పరిపాలనా పగ్గాలు చేపట్టగానే ఇసుక రవాణపై నిషేధం విధించడాన్ని కూడా నారా లోకేష్ తప్పబట్టారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని ఇది సముచితం కాదని హెచ్చరించారు, ఇసుక విధానం ప్రకటించేంత వరకు భవన నిర్మాణ కార్మికులకు తాత్కాలిక భృతి కింద నష్టపరిహారం చెల్లించాలని కూడా నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Nara Lokesh TDP

భవన నిర్మాణ కార్మికులు ఇసుక రవాణపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరినా పట్టించుకునేవారే లేరా.? వీరి ఆర్థనాధాలు, అన్నమో రామచంద్ర అంటూ వారు వేస్తున్న ఆకలి కేకలు పాలకులకు వినిపించడం లేదా.? అంటూ నారా లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా తాను స్వయంగా ప్రజల గొంతుకయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలను ప్రశ్నిస్తున్న నేతగా ఎదుగుతున్నారు. అనగారిన వర్గాల వారికి తాను గళాన్ని అవుతానని లోకేష్ వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పాలకపక్షం సాగించే ఆగడాలలో బాధితులైన బడుగు బలహీనవర్గాలకు తాను అన్నగా మారుతున్నారు, ఎస్సీ, ఎస్టీల ఇంటి బిడ్డగా, మైనారిటీలకు సోదరుడిగా, కాపులకు పెద్దకాపుగా, అన్ని కులసమీకరణలు చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ అందరికీ తానుగా.. అందిరలోనూ తానోకడిగా ముందుకు సాగుతున్నాడు.

Nara Lokesh new style

అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరద ముంపులో కూరుకుపోగా, ఇప్పటి ప్రభుత్వచర్యలకు, అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను బేరిజు వేసుకునేందుకు ప్రభావిత ప్రాంత ప్రజలకు అవకాశం లభించింది. ఒక హుద్దూద్, ఒక బుల్బుల్, ఒక రోను, ఒక తిత్లీ ఇలా వరుస తుఫాన్లు రాష్ట్రంటోని కోస్త్రాంధ్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపినా.. వారికి నష్టపరిహారం చెల్లిస్తూనే.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించి.. తమ ప్రభుత్వం బాధిత ప్రజలకు అండగా నిలిచిందని, మరీ అలాంటి చర్యలు ప్రస్తుతం ప్రభుత్వానికి అలవాటు లేదా..? వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయినా.. బాధితులను వారి మానన వారిని వదిలేసి.. చేతులెత్తేస్తోందా.? అంటూ కూడా నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కూల్చివేతలు తప్ప.. ప్రజలు తిప్పలు పట్టవా అని నిలదీసారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణిలో అధికార దర్పంతో భయపెట్టి, పోలీసులతో అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని.. అయినా తాను టీడీపీ కార్యాకర్తలతో పాటు ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తామని అన్నారు,

Nara Lokesh Protest

అమరావతిని ఏపీకి రాజధానిగా తమ పార్టీ కూడా పూర్తి అంగీకారం ఇస్తుందని నిండు శాసనసభలో సమ్మతి వ్యక్తం చేసిన అప్పటి ప్రతిపక్ష నేత.. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాజదాని నగర నిర్మాణానికి 30 వేల ఎకరాలు సరిపోవని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని నారా లోకేష్ అన్నారు. అంతేకాదు అమరావతే రాజధాని అని ఎన్నికలకు ముందు ఇక్కడే తన నివాసాన్ని కూడా ఏర్పర్చుకుని ప్రజలందరూ భ్రమించేలా చేశారని అన్నారు. ఇక తమ పార్టీకి అధికారం అందగానే మూడు రాజధానుల అంశంతో అమరావతి రైతులను మోసం చేశారని నారా లోకేష్ అరోపించారు. రాష్ట్ర రైతన్నకు చిన్న కష్టం వచ్చినా దానిని తీర్చడానికి తాను ముందువుంటానని చెప్పిన జగన్.. వెనకగా వచ్చి వెన్నుపోటు పోడిచారని నారా లోకేష్ అరోపించారు, అమరావతి రైతులను, జేఏసీ నాయకులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని ధైర్యాన్ని అందించారు,

టీడీపీ పార్టీ పునర్నిర్మాణంలో క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులుగా వున్న ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారయన. ముఖ్యంగా బీసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో చెరగని ముద్రవేసుకున్న టీడీపీ పార్టీని మళ్లీ ఆయా వర్గాలకు చేరువ చేసేలా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆయా వర్గాల్లోని కుల సమీకరణలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని కూడా ఆకర్షించి పార్టీని బలోపేతం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమకు బలమైన సామాజిక వర్గంగా వున్న కులవృత్తుల వారిని ఆకర్సించేందుకు చర్యలు చేపడుతున్నారు. అదే సమయంలో అగ్రవర్గాల్లోని బ్రాహ్మణులను మొదలుకుని, ఆదివాసిల వరకు అటు కాపులను, ఇటు వైశ్యులను, యాదవ, గౌడ, నాయి బ్రాహ్మణ, పద్మశాలి, ఇలా అన్ని కులపెద్దలతోనూ ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు, వారితో ప్రత్యేక చర్చలు నిర్వహించి వారికి పార్టీలో కొనసాగితే భవిష్యత్తుఎలా వుంటుందో కూడా అర్థవంతంగా అలోచింపజేస్తున్నారు,

Nara Lokesh Speech

అదే సమయంలో ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా పటిష్టపర్చుకునే బాధ్యతను ఆయన తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇందుకోసం పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని భావించిన ఆయన.. అందుకు అనుగూణంగా చర్యలను తీసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలను ఉన్నతమైన భాద్యతలను అందిస్తూనే.. అదే సమయంలో రాష్ట్రంలో కొత్త నాయకులను, యువ నాయకులను ప్రోత్సహించేలా కూడా ఆయన ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తటస్థంగా వుంటూ.. ప్రజాహిత కార్యక్రమాలను చేస్తున్న ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. క్లీన్ ఇమేజ్ వున్న ప్రముఖులను కూడా పార్టీలోకి అహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. రానున్న ఎన్నికల నాటికి పార్టీలో అన్ని విధాలుగా సమాయత్తం చేయాలని ఆయన పూనుకున్నారు. నాయకులను తయారు చేసే కర్మాగారమైన తెలుగుదేశం పార్టీలో.. నూతనంగా ఆయా బాధ్యతలను మోయనున్న ఇంజనీరుగా నారా లోకేష్ మారనున్నారు.

Nara Lokesh AP

ఇటీవల అక్టోబర్ నెలలో అకాలవర్షాలు కురవడంతో అనేక లొతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వేల ఏకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో యువనేతగా ఆయన ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి ముంపుకు గురైన ప్రాంతాలతో పాటు నీటమునిగిన పంటలను కూడా పరిశీలించారు. ముంపు ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టరును తానే స్వయంగా నడుపించగా, కార్యకర్తలు ఎక్కువ మంది ఎక్కడంతో వాహనం సిద్దాపురం గ్రామశివార్లలో పంటకాలువలోకి దూసుకెళ్లింది. దీంతో పశ్చిమ గోదావరి పోలీసులు ఆయనపై 279 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు, ఇంతలా నారా లోకేష్ ను టార్గెట్ చేయడానికి.. పోలీసు కేసులు నమోదు చేయడానికి కారణం.. ఆయన తానేంటో నిరూపించుకోవడమే.. అని పలువరు వ్యాఖ్యానిస్తున్నారు,

Nara Lokesh Photos(Images Source: Twitter.com/naralokesh)

ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా వుంటూ రాష్ట్రంలోని ప్రతీ సమస్యను తనదైన శైలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో పాలకపక్షం ఫాలో అవుతున్నది భారత రాజ్యాంగం కాదని, రాజారెడ్డి రాజ్యంగమని.. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని గుంటూరు జిల్లా కనమలచెరువుకు చెందిన నాసరయ్య అనే టీడీపీ కార్యకర్తపై అధికార పార్టీ గుండాలు దాడి చేశారని.. ఆయన కుటుంబంపై కేసు పెట్టి వేదిస్తున్నారని, జగన్ ట్రాప్ లో పడిన పోలీసులు అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని నారా లోకేష్ ఘాటుగానే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు, అంతేకాదు బాధితుల సంబాషణను కూడా పోస్టు చేసిన నారా లోకేష్.. వైసీపీ అరాచక పాలనతో బిసీ వర్గ బాధితుడి ఆక్రందన ఇది అని ప్రభుత్వాన్ని పశ్నించారు.

ఎన్నికల ముందు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకోచ్చిన 108 పథకం సేవలు కూడా ప్రజలకు సకాలంలో అందడం లేదని నారా లోకేష్ అరోపించారు. కుయ్ కుయ్ కుయ్ అంటే వచ్చే 108 అంబులెన్సు.. వైఎస్ జగన్ పాలనలో కుయ్యో.. మొర్రో అంటున్నాయని, అనుభవం లేని సంస్థకు పగ్గాలను అప్పజెప్పి అవినీతికి పాల్పడటంతో ఓ అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలోని స్కూలు హెడ్ మాస్టార్ నారాయణ స్వామి అస్వస్థతకు గురై నడిరోడ్డుపై పడిపోయారని.. దీనిని గమినించిన స్థానికులు 108కు ఫోన్ చేసినా.. అది ఎంతకీ రాలేదని.. దీంతో ప్రైవేటు అంబులెన్సులో ఆయనను అసుపత్రికి తరలించారని.. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటంపై వున్న శ్రద్ద ప్రజల ప్రాణాలపై లేదని తూర్పారబట్టారు.

ఇక రాష్ట్రంలో మైనారిటీల పరిస్థితి కూడా దారుణంగానే తయారైంది ఈ నెలలో అన్నారు. అందుకు రెండు వీడియోలను కూడా పోస్టు చేశారు. రాష్ట్ర పాలన రాక్షసరాజ్యాన్ని తలపిస్తోందని అన్నారు. సీఎం సోంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలోని రాయచోటిలో అంగన్ వాడీ వర్కర్ ను తీసేసి తమ వాళ్లను నియమించుకునేందుకు వైఎస్సార్ ముస్లిం నేతలు.. ముస్లిం మహిళని వేధించడంతో పాటు ఏకంగా పాఠశాలనే కాల్చేశారని అరోపించారు. ఇక దీంతో పాటు నంద్యాలలోని 14ఏళ్ల కూతరు సల్మా, 12ఏళ్ల కుమారుడు కలందర్ లను ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వెనక్కు తీసుకురాగలదా.? అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇవే కాదు ప్రతి నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణులు, అభిమానులతో పంచుకుంటున్నారు,

ఇటు తమ పార్టీ నేతలకు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంలోనూ నారా లోకేష్ స్టైలే ఢిపరెంట్. పార్టీ అగ్రనేతలే కాదు నియోజకవర్గాల నేతలు, జిల్లా అధ్యక్షులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచుల జన్మదిన తేదీలను గుర్తుపెట్టుని వారికి ఆయన వారి పుట్టిన రోజునే తెలపడంలో ఆయన ఆనందాన్ని పోందుతారు. తమ పార్టీ నాయకులకు పోందే ఆనందంలోనే తన ఆనందం వుందని ఆయన పేర్కోన్నారు, అయితే మండల స్థాయి నాయకుల నుంచి ప్రతీ ఒక్కరినీ గుర్తుపెట్టుకుని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే ఆయనకు పార్టీపై ఎంత పట్టు సాధించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేత రాబోపు రోజుల్లో జగన్ లాంటి యువనేతను ఢీకొనేందుకు నారా లోకేష్ లాంటి లీడర్ అవసరం ఎంతైనా వుందని, జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి.. నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ పార్టీ సమఉజ్జీ అవుతుందని.. నారా లోకేష్ తొంబై దశకంలో చంద్రబాబును తలపిస్తున్నాడని ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భావిస్తున్నారు. తండ్రిని మించిన తనయుడు అవుతారని ఆశిస్తూ.. మనం కూడా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుదాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles