1300-year-old temple discovered in Pakistan పాకిస్థాన్ లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి చారిత్రక విష్ణు దేవాలయం

Lord vishnus 1300 year old temple discovered in northwest pakistans swat

Ancient vishnu temple in pakistan, Swat valley, hindu temple in pakistan, hindu shahi dynasty, ancient temple in swat, Ancient vishnu temple, 1300 year old hindu temple, Hindu temple, Ghandhara civilisation, Archeology, Swat, Pakistan

A Hindu temple, believed to have been constructed 1,300 years ago, has been discovered by Pakistani and Italian archaeological experts at a mountain in northwest Pakistan's Swat district. The discovery was made during an excavation at Barikot Ghundai.

పాకిస్థాన్ లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి చారిత్రక విష్ణు దేవాలయం

Posted: 11/21/2020 07:35 PM IST
Lord vishnus 1300 year old temple discovered in northwest pakistans swat

ఇందుగలడు అందుగలడన్న సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!.. అనిశ్రీమద్భాగవతంలోని భక్త ప్రహల్లాదలో పోతన రచించిన ఈ పద్యవాఖ్యము ఎంతటి సత్యమో శ్రీమహావిష్ణు అవతారమైన నరసింహస్వామి అప్పుడే ఆ ఇతివృత్తంతంలో స్పష్టంగా కనిపించి చెప్పాడు. కాగా తాజాగా ఈ తరానికి కూడా ఆయన మరో రూపంలో క్లారిటీని ఇచ్చారు. పూర్తిగా ఇస్లామిక్ మతఛాందస దేశంగా ముద్రపడి ఐక్యరాజ్య సమితిలోనూ పరాభవాలను చవిచూస్తున్న పాకిస్థాన్ లో ఇప్పటికే పలు చారిత్రక నేపథ్యమున్న హిందూ దేవాలయాలు వున్నాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే అక్కడి హిందువులు పూజలు నిర్వహిస్తుండగా, అనేక ఆలయాలు దూప, దీప నైవేధ్యాలకు కూడా దూరంగా వున్నాయి.

ఇలాంటి క్రమంలోనే అత్యంత పూరతనమైన శ్రీమహా విష్ణువుకు చెందిన హిందూ దేవాలయం ఒకటి తాజాగా జరుపుతున్న తవ్వకాల్లో బయటపడింది. పాకిస్థాన్ లోని వాయువ్య ప్రాంతంలోగల స్వాత్‌ జిల్లాలోని బారీకోట్‌ ఘుండాయ్‌ ప్రాంతంలో ఒక పర్వతం వద్ద పాక్‌, ఇటాలియన్‌ పురావస్తు నిపుణులు జరుపుతున్న తవ్వకాల్లో ఈ ఆలయాన్ని కనుగొన్నారు. పాకిస్తాన్ లోని అత్యంత ప్రాముఖత కలిగిన పర్యాటక ప్రదేశాలలో స్వాత్ ఒకటి, ఇక్కడి ప్రకృతి అందాలు, సాంస్కృతిక ప్రదేశాలు ఇట్టే అకర్షిస్తాయి. పురావస్తు ప్రాంతాలకు నెలవుగా మారిన ఈ ప్రాంతంలో దాదాపు 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీలు నిర్మించిన విష్ణు దేవాలయమని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ అధికారి ఫజల్‌ ఖలీక్‌ తెలిపారు. ఆలయ సమీపంలో కొలను, వాచ్‌టవర్‌, కంటోన్మెంట్‌ ఆనవాళ్లను కూడా కనుగొన్నట్టు వివరించారు.

ఆలయంలో దర్శనానికి వెళ్లే ముందు స్నానం కోసమే ఈ కొలను నిర్మించినట్టు భావిస్తున్నామని అన్నారు. వేలాది పురావస్తు ప్రాంతాలకు స్వాత్ జిల్లా నిలయమని ఖలీక్ వ్యాఖ్యానించారు. హిందూ షాహీల కాలం నాటి నిర్మాణాలు ఈ ప్రాంతంలో బయటపడటం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ జిల్లాలో పలు బౌద్ధ ఆరామాలు కూడా ఉన్నట్టు పురావస్తు నిపుణులు తెలిపారు. హిందూ షాహీ లేదా కాబుల్‌ షాహీలు క్రీ.శ.850-1026 ప్రాంతంలో కాబుల్‌ లోయను పాలించిన హిందూ రాజ వంశం. వారి పాలనా కాలంలో తూర్పు అఫ్ఘనిస్థాన్‌, గాంధార (ఆధునిక పాకిస్థాన్‌), వాయువ్య భారతదేశాన్ని కాబుల్‌ లోయగా పిలిచేవారు. ఇటాలియన్ పురావస్తు మిషన్ హెడ్ డాక్టర్ లూకా మాట్లాడుతూ.. గాంధార నాగరికత, శిల్ప కళకు చెందిన ఆలయం స్వాత్ జిల్లాలో గుర్తించడం ఇదే తొలిసారని అన్నారు. ఈ ప్రాంతం బౌద్ధ ఆరామాలకు నిలయమని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles