Covishield to cost Rs 1,000 for 2 vaccine doses 2024 నాటికి దేశ ప్రజలందరికీ కరోనా వాక్సీన్: అడార్‌ పూనావాలా

Coronavirus vaccine update probably by 2024 every indian will get vaccinated sii

Coronavirus vaccine, Coronavirus vaccine update, Coronavirus vaccine in India, Serum Institute covaxin price, Serum Institute covaxin launch 2021 q1, Serum Institute covaxin launch, Serum Institute covaxin, Serum Institute Coronavirus vaccine update India, COVID19 vaccine, COVID19 vaccine news, COVID19 vaccine India, COVID19 vaccine update, COVID19 vaccine progress, COVID19 vaccine name

Oxford University's collaborator Serum Institute of India (SII) has said the vaccine will be available to public by April next and every Indian will possibly get vaccinated by 2024

2024 నాటికి దేశ ప్రజలందరికీ కరోనా వాక్సీన్: అడార్‌ పూనావాలా

Posted: 11/21/2020 07:26 PM IST
Coronavirus vaccine update probably by 2024 every indian will get vaccinated sii

యావత్ మానవాళిపై ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే వాక్సీన్ తయారీలో నిమగ్నమయ్యాయి, నాణ్యతతో కూడిన వాక్సీన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూపులు కొనసాగుతున్న వేళ.. భారతీయులకు ఫార్మదిగ్గజ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) శుభవార్తను తెలిపింది. వచ్చే ఏడాది నాటికి తమ టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించిన సంస్థ.. తాజాగా దేశంలో ప్రతి ఒక్కరికీ 2024 కల్లా కరోనావైరస్‌ నిరోధక టీకా అందుతుందని ఎస్ఐఐ సంస్థ సీఈఓ అడార్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బందికి, వృద్ధులకూ ఫిబ్రవరి 2021లోగా అందుతుందని వెల్లడించారు. అలాగే ఏప్రిల్ లో సాధారణ ప్రజలకు టీకా పంపిణీ ప్రారంభం అవుతుందని అన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌ ధర అందరికీ అందుబాటులో ఉండేవిధంగా వెయ్యి రూపాయల వరకు ఖర్చు కాగలదని ఆయన అంచనా వేశారు. కానీ యావత్‌ దేశానికి కోవిడ్‌- 19 వ్యాక్సిన్‌ అందించేందుకు కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుందని పూనావాలా అన్నారు. ఆక్స్‌‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కోవిడ్‌ -19 వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ అస్ట్రాజెనెకాతో ఎస్‌ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఐదు లేక ఆరు డాలర్లు ఉండాల్సిన వ్యాక్సిన్‌ ధర కేవలం నాలుగు డాలర్లకే లభిస్తోందని.. మార్కెట్లో ఉన్న అన్ని వ్యాక్సిన్ల కంటే తమ టీకా ధరే తక్కువని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కూడా కరోనా టీకాను 2021 సంవత్సరం రెండో త్రైమాసికంలో నాణ్యతతో కూడిన టీకాకు తాము అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. దీంతో వచ్చే ఏడాది రెండో త్రైమాసికం చివరి నాటికి మరిన్ని సంస్థల టీకాలు అందుబాటులోకి రానున్నాయని సమాచారం, వీటి రాకతో కరోనా సహా మహమ్మారి వ్యాధులకు చరమగీతం పాడటంతో పాటు అర్థిక ప్రగతి మళ్లీ గాడిన పడుతుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles