Tungabhadra Pushkaralu begins from today to Dec 1 తుంగభద్ర పుష్కరాలు.. అటు కర్నూలు.. ఇటు ఆలంపూర్..

Tungabhadra pushkaralu begins from today to december 1

Tungabadra Pushkaralu in Telangana, Tungabhadra, Thungabadra, Tungabhadra Pushkaralu, River Pushkaralu in telugu states, Kurnool Pushkaraalu, Jogulamba Gadwal, Alampur, Arrangements, COVID-19, Telangana government

Tungabhadra Pushkaralu, the festival that celebrates the Tungabhadra river which spans across four states Telangana, Andhra, Karnataka and Maharashtra is set to begin on Friday. The Telangana government has prepared all the necessary arrangements for the Pushkaralu to be held in Alampur and has issued separate guidelines for the festival amid the COVID-19 pandemic.

తుంగభద్ర పుష్కరాలు.. అటు కర్నూలు.. ఇటు ఆలంపూర్..

Posted: 11/20/2020 04:37 PM IST
Tungabhadra pushkaralu begins from today to december 1

తుంగభధ్ర నదీమతల్లి పుష్కరాలు ఇవాళ ప్రారంభమయ్యాయి, మధ్యాహ్నం 1.21 గంటలకు గురువు మకరరాశిలోకి ప్రవేశించడంతో పుష్కారాలు ప్రారంభం మయ్యాయి, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగుతున్న ఈ జీవనది.. లక్షలాది మంది దాహార్తిని తీరుస్తూ.. లక్షలాది మంది రైతుల పాలిట కల్పతరువుగా మారింది. ఈ పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తతల నడుమ పుష్కరాల ఏర్పాట్లను చేపట్టడంతో పాటు ఘాట్ లలో స్నానాలు అచరించడానికి పలు నిబంధనలు పెట్టాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ లోని సంకల్ భాగ్ ఘాట్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పుష్కరాలను ప్రారంభించగా, ఇటు తెలంగాణలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ లు పుష్కరల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నదిలో స్నానాలను ఆచరించారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులను స్నానాలకు అనుమతించనున్నారు. మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు తుంగభద్ర పుష్కరిణి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మంత్రాలయం పీఠాధిపతి, పూజారులు, భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇవాళ్టి నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. తుంగభద్ర పుష్కర వేడుక నేపథ్యంలో మంత్రాలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, భక్తుల కోసం దర్శనాలు, పరిమళ ప్రసాదాలు, అన్నదానం తదితర ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రోజూ ఉదయం, సాయంకాలాలు ఉచిత దర్శనాలను భక్తులకు కల్పించనున్నారు, దర్శనాల కోసం అదనంగా వరసలు, వీఐపీల కోసం ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు పరిస్థితులను బట్టి ప్రత్యేక గేటు ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మంత్రాలయం అధికారులు అహ్వానించిన నేపథ్యంలో ఆయన కూడా ఇక్కడకు విచ్చేయనున్నారు, భక్తులు ఘాట్ ల వద్ద ఎలాంటి అవాంతరాలు ఎదుర్కుకాకుండా అన్ని చర్యలను తీసుకుంటున్న ప్రభుత్వం.. నీటి సమస్య లేకుండా ఉండేందుకు తుంగభద్ర డ్యాం నుంచి అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 23 ఘాట్లను నిర్మించింది. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనుంది. నదిలో ఘాట్ ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. కాగా, 2008లో వచ్చిన తుంగభద్ర పుష్కరాల్లో 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

(Video Source: Ysrcpofficial)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles