Be Ready for general Elections: Pawan Kalyan జనసేన శ్రేణులకు పవన్ పిలుపు.. 2024 కంటే ముందే ఎన్నికలు

Be ready for general elections may be before 2024 pawan kalyan

Pawan Kalyan, Pawan Kalyan Janasena, Janasena, janasena activists, Janasena general elections, janasena activists meet, Andhra pradesh, politics

JanaSena President Pawan Kalyan urges his party activists to be ready for general Elections, which may be before 2024

జనసేన శ్రేణులకు పవన్ పిలుపు.. 2024 కంటే ముందే ఎన్నికలు

Posted: 11/20/2020 04:04 PM IST
Be ready for general elections may be before 2024 pawan kalyan

(Image source from: Twitter.com/JanaSenaParty)

సార్వత్రిక ఎన్నికలకు సిద్దం కావాలని.. ఇందుకు ముందునుంచే సన్నధం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందే వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు, ఇప్పటి నుంచే అందుకు సిద్ధం కావాలని ఆయన పార్టీ క్రీయాశీలక శ్రేణులకు సూచించారు. ప్రజల్లో అభిమానం మెండుగా వున్నా వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో తాను విఫలమయ్యానని అన్నారు. అందుకనే ఈ సారి అలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగానే కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు, తనకు సినీస్టార్ గా వున్న సెలబ్రిటీ స్టేటస్ తో తన వరకు పనులను చక్కబెట్టుకోగలనని, అయితే తన పార్టీ తన కోసం కాదని, ప్రజల కోసమని చెప్పారు.

ప్రజల కోసం నిలబడాలన్న బలమైన ఉద్దేశంతోనే పార్టీని పెట్టినట్టు చెప్పిన పవన్.. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభజన జరుగుతున్న తరుణంలో తాను రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తాను నిలబడాలని నిర్ణయించుకున్నానే తప్ప.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రశ్నించేవాడిగా మాత్రమే మిగలిపోవాలని భావించానని చెప్పారు. అయితే శాసనసభలో ప్రశ్నిస్తేనే అది తీర్ధంగా మారుతుందని, తెలుసుకోవడం ద్వారా గత ఎన్నికలలో పోటీ చేసినా.. తనపై ప్రజల్లో వున్న అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో మాత్రం విఫలమయ్యానని అన్నారు, భవిష్యత్తులో అధికారాన్ని అందుకోవాలంటే క్రియాశీలక సభ్యత్వం చాలా అవసరమని, ప్రతి సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతోందని, ఒక్క జనసేన సైనికులు మాత్రమే బెదిరింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్నారని అన్నారు.

జనసేన మద్దతుదారులమంటూ కొందరు చిన్నచిన్నవేదికలు ఏర్పాటు చేసుకుని సొంత అజెండాతో వస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలను కోరారు. ఎవరైనా సరే జనసేన స్రవంతి ద్వారానే రావాలని అన్నారు. పార్టీ నచ్చకపోతే సరైన కారణాలు తెలియజేయాలి తప్పితే ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తామంటే కుదరదని అన్నారు. వందమంది వెళ్లిపోతే వెయ్యి మందిని తీసుకొస్తామని పవన్ స్పష్టం చేశారు. మరో రెండు వారాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి ఏపీ ప్రభుత్వ మద్యం, ఇసుక విధానాలతోపాటు ఇతర సమస్యలపై చర్చిస్తామని పవన్ వివరించారు. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని గ్రామ వలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని, అయినా ఒత్తిళ్లకు తట్టుకుని పవన్ కల్యాణ్‌పై నమ్మకంతో పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles