Students, teachers infected after schools reopen in AP ఏపీలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై కరోనా పంజా

Covid 19 575 students 829 teachers infected as schools reopen in ap

school reopening, Covid-19, coronavirus, AP coronavirus, Chittoor, reopening of schools andhra pradesh, teachers, students andhra pradesh schools, andhra pradesh teachers test positive, reopening schools coronavirus, Andhra Pradesh

As many as 575 students of class 9 and 10 and 829 teachers have tested positive for COVID-19 in Andhra Pradesh after schools reopened on November 2. Classes resumed for class 9 and 10 and intermediate (second year) three days ago across the State following physical distancing norms.

ఏపీలో వందల మంది ఉపాద్యాయులు, విద్యార్థులకు కరోనా..

Posted: 11/06/2020 11:41 AM IST
Covid 19 575 students 829 teachers infected as schools reopen in ap

(Image source from: Telugubulletin.com)

దేశవ్యాప్తంగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు మరో నెల రోజుల పాటు అమల్లో వుంటాయని కేంద్ర హొం మంత్రిత్వ శాఖ అక్టోబర్ నెలాఖరులో ప్రకటించి.. దేశంలోని పాఠశాలలు, విద్యాసంస్థలు, కాలేజీలన్నీ నవంబర్ ఆఖరు వరకు తెరుచుకోవని అదేశాలు జారీ చేసినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 2 నుండి విద్యాసంస్థలను తెరిచింది. దీని ఫలితంగా అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులపై కరోనావైరస్ మహమ్మారి పంజా విసిరింది. పాఠశాలలకు వెళ్లిన విద్యార్ధులకు శానిటైజేషన్, మాస్క్, సహా సామాజిక దూరం పాటించినప్పటికీ మహమ్మారి పంజా విసురుతోంది

నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నెల 12 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి, కాగా ఇప్పటికే రాష్ట్రంలో వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనావైరస్ బారిన పడ్డారు. ఇక ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కూడా తరగతులు కూడా ప్రారంభం అవుతాయని ప్రభుత్వ సీఎస్ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కోనగా, అదే జరిగిదే తమ పిల్లల అరోగ్యాల మాటేమిటని, తల్లితండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి,

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా 575 మంది విద్యార్థులు, 829 మంది ఉపాధ్యాయులపై కరోనా మహమ్మారి తన పంజాను విసిరింది. రాష్ట్రంలోని 41,623 పాఠశాలల్లో 70,790 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వీరిలో 829 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 95,763 మంది విద్యార్థులకు కూడా టెస్టులు నిర్వహించారు. పాజిటివిటీ రేటు విద్యార్థుల్లో 0.06 శాతంగా ఉండగా, ఉపాధ్యాయుల్లో 1.17 శాతంగా ఉంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో కరోనా పరీక్షలను నిర్వహించగా.. 10 మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో, వారందరినీ వెంటనే పాఠశాల నుంచి ఇంటికి పంపించేశారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 120 మంది టీచర్లకు కరోనా సోకింది. ఓ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం గంగలకుర్రు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 9.75 లక్షలుగా ఉందని... పాఠశాలలకు హాజరైన వారు కేవలం 3.93 లక్షల మంది మాత్రమేనని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles