HC denies interim bail to Journalist Arnab Goswami అర్నాబ్ గోస్వామి బెయిల్ నిరాకరణ.. 14 రోజుల రిమాండ్..

Bombay high court denies interim bail to republic tv owner arnab goswami

Arnab Goswami,Bombay High Court, Republic TV, Editor-in-Chief, judicial custody, architect Anvay Naik, non-payment of duesm abetment to suicide case, Arnab Goswami interim bail plea, N M Joshi Marg police station, Maharashtra, crime

The Bombay High Court on Friday refused to grant interim relief to Arnab Goswami, the Editor-in-Chief and owner of Republic TV, who has been remanded to 14-day judicial custody till November 18 in a 2018 abetment to suicide case.

అర్నాబ్ గోస్వామి బెయిల్ నిరాకరణ.. 14 రోజుల రిమాండ్..

Posted: 11/06/2020 12:01 PM IST
Bombay high court denies interim bail to republic tv owner arnab goswami

రిపబ్లిక్ టీవీ సీఈఓ అర్నాబ్ గోస్వామి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అర్నబ్ పై కేసు వేసిన బాధితురాలి వాదనలు వినకుండా.. ఆయనకు బెయిలు ఎలా ఇస్తామని న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా ఆయన దాఖలు చేసిన హెబియస్ ఫిటీషన్ ను రేపు న్యాయస్థానం విచారించనుంది. అదే సమయంలో మరోమారు బెయిల్ పిటీషన్ పై కూడా విచారణను న్యాయస్థానం రేపు విచారించే అవకాశలు వున్నాయి, అయితే అంతకుముందు ముంబైలోని కోర్టు అర్నబ్ గోస్వామికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. గత ప్రభుత్వం ఈ కేసును మూసివేయగా, బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనతో తిరిగి తెరచిన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నిన్న ఉదయం గోస్వామిని అరెస్ట్ చేసింది.

అర్నాబ్ ను రెండు వారాలపాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించిన అలీబాగ్ కోర్టు.. అరెస్ట్ సమయంలో తనపై పోలీసులు భౌతికదాడికి దిగారన్న అర్నాబ్ ఆరోపణలను తోసిపుచ్చింది. అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో తమతో సహకరించాల్సిందిగా పోలీసులు పలుమార్లు అర్నాబ్‌ను కోరడం అందులో కనిపించింది. అయితే, అర్నాబ్ మాత్రం పోలీసులు తనపై దాడికి పాల్పడినట్టు ఆరోపిస్తున్నారు. కాగా, తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా అర్నాబ్ పెట్టుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారించనుంది. అలాగే, బెయిలు కోసం కూడా ఆయన దరఖాస్తు చేసుకోగా దానిపై విచారించేందుకు న్యాయస్తానం నిరాకరించింది.

అయితే అర్నబ్ గోస్వామి విషయంలో మహరాష్ట్రలోని శివసేన సర్కారుపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై శివసేన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా చేసిన అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే బీజేపీ 'బ్లాక్ డే", 'మీడియా స్వేచ్ఛపై దాడి' అంటూ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేసింది. అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని... మహారాష్ట్రలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారని శివసేన అధికార పత్రిక 'సామ్నా' విమర్శించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్ లో ఒక జర్నలిస్టును అరెస్ట్ చేశారని, ఉత్తరప్రదేశ్ లో జర్నలిస్టులను చంపేశారని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉదంతాలు ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయని బీజేపీ నేతలు ఎవరూ అనలేదని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles