Jyotiraditya Scindia makes slip of tongue at MP rally కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలన్న సింధియా.!

Bjps jyotiraditya scindia appeals voters to vote for the hand at mp rally

Jyotiraditya Scindia, Bharatiya Janata Party, Congress, Dabra, Imarti Devi, Public meeting, kamal nath, Scindia rally viral video, Scindia congress viral video, Scindia dog viral video, Scindia news, Madhya Pradesh election, Politics

In an embarrassing slip of tongue, BJP leader Jyotiraditya Scindia asked the crowd at a rally to 'press the button with the symbol of the hand and vote for Cong...' before correcting himself. Scindia was campaigning in Dabra for his party ahead of the bye-elections in Madhya Pradesh on November 3.

ITEMVIDEOS: బీజేపిలో చేరినా.. అభ్యర్థన మార్చుకోని జ్యోతిరాదిత్య.. వీడియో వైరల్

Posted: 11/02/2020 09:16 PM IST
Bjps jyotiraditya scindia appeals voters to vote for the hand at mp rally

తండ్రి నుంచి వారసత్వంగా అందిన రాజకీయ పార్టీ.. నిన్నమొన్నటి వరకు తాను అదే కాంగ్రెస్ పార్టీలో వుంటూ ప్రతీ ఎన్నికలో ఓటర్లను కాంగ్రెస్ కే ఓటు వేయాలని అభ్యర్థించాడు. అయితే తనకు పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని ఇటీవలే తన వర్గానికి చెందిన ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపిలోకి చేరి రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమయ్యారు. దీంతో తనకు అదే ఉపముఖ్యమంత్రి పదవి మాత్రమే లభించినా తన మాట చెల్లుబాటు తన హామీలు నెరవేరడం కనిపిస్తున్నాయి, అయితే తన కోసం పార్టీ ఫిరాయించిన అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించడంతో ఉపఎన్నికలు వచ్చాయి, తనకు మద్దతునిచ్చిన అభ్యర్థుల విజయాన్ని భుజాన వేసుకున్న జ్యోతిరాధిత్య సింధియా వారి కోసం ప్రతీ నియోజకవర్గం తిరుగుతూ ఎన్నికలను అభ్యర్థిస్తున్నారు.

పార్టీ మారడం తేలికే అయినా దశాబ్దాలుగా వచ్చిన అలవాటు మాత్రం పోవడం కష్టంగా పరిణమించింది సింధియాకు. అయితే అయన నోరుజారడాన్ని ఎన్నికల సమయంలో క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకే మీ ఓటు వేయాలని ఆయన చెప్పిన వీడియోను ఇప్పుడు నెట్టింట్లో పెట్టడంతో పాటు దానిని విరివిగా ప్రచారం కల్పించింది. ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రతీ ప్రాంతంలోనూ ఓటర్లు ఇప్పటికే నిర్ణయం తసీుకున్నారని, వారు కచ్చితంగా అదే పని చేస్తారని తమ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చమత్కరిస్తున్నారు, దీంతో జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారడం తేలికే అయినా తండ్రి నుంచి అందిన వారసత్వం మాత్రం కోల్పోడానికి కొంచం సమయం పడుతుందని కామెంట్లు కూడా వినబడుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉప ఎన్నికల ప్రచార సభలో బీజేపీ అభ్యర్థిని ఇమర్తీ దేవి పోటీ చేస్తున్న దబ్రా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, 'హస్తం గుర్తుకే మన ఓటు' అని నినదించి, అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు, తాను నాలుక్కరుచుకున్నారు. ఆమె తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన సింధియా, "మీ చేతులు పైఎత్తి. నన్ను, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను గెలిపిస్తామని చాటిచెప్పండీ అంటూ నినదించారు. దాబ్రా ఓటరు మహాశయులారా, 3వ తేదీన మీరంతా హస్తం గుర్తుకు ఓటు వేయాలి" అని అన్నారు. ఆ వెంటనే జరిగిన తప్పును తెలుసుకున్న ఆయన, దాన్ని సరిదిద్దుకున్నారు. దీంతో ఈ వీడియో క్లిప్ ను  మధ్యప్రదేశ్ కాంగ్రెస్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyotiraditya Scindia  BJP  Congress  Dabra  Imarti Devi  Public meeting  kamal nath  Madhya Pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh