ఆర్జీడి యువనేత తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో హేమాహేలీలతో తలపడుతూ తన తండ్రి బాటలో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. తమతో కలసి గత ఎన్నికలలో మహా కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్ కూటమి పక్షాలకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఇప్పుడు ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో మధ్యకు వెళ్తున్నారు. ప్రజలకు నితీశ్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అందుకు ఓటుకు ఆయుధంగా మలుచుకోవాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ.. నితీశ్ కుమార్ పై చేసిన అరోపణల వీడియోలను కూడా అస్త్రాలుగా చేసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు. ఈ తరుణంలో మూడు విడదల ప్రచారంలో భాగంగా ఇవాళ మరో విడద ప్రచారానికి తెరపడనుండడంతో ఆయన తన తండ్రి రికార్డును కూడా బద్దలుకొడుతున్నాడు.
తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరునున్న అత్యధిక బహిరంగ సభల రికార్డును తాజాగా ఆయన బద్దలు కొట్టారు, ఇవాళ ఒక్కరోజునే ఆయన ఏకంగా 19 సభలు నిర్వహించడం ద్వారా ఆ రికార్డును నెలకొల్పారు, అయితే వీటిలో రెండు రోడ్ షోలు కూడా వుండటం గమనార్హం. ఇక మిగిలిన 17 బహిరంగ సభలు కావడం లో తేజస్వీ యాదవ్ ఈ రికార్డును అందుకున్నారు, ఈ స్థాయిలో బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గోన్న ఘనత ఎవరికీ లేకపోవడం గమనార్హం. కాగా, తేజస్వీ తండ్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం గతంలో ఏకంగా 16 బహిరంగసభల్లో పాల్గోన్ని ప్రసంగించడం ద్వారా రికార్డు నెలకొల్పారు.
ఇతక తాజాగా తన తండ్రి పేరున వున్న రికార్డును తేజస్వీ తన సోంతం చేసుకున్నారు. ఇవాళ ఉదయం రెండో విడత ఎన్నికలలో భాగంగా ప్రచారపర్వానికి తెరపడనున్న నేపథ్యంలో ఏకంగా 19 ప్రాంతాల్లో సభల్లో పాల్గోన్ని ఆయన ప్రసంగించి అక్కడి ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మరీ ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పిస్తామని హామి ఇస్తున్నారు, తమ పార్టీ అజెండాను ప్రజలు ముందు చెప్పడంతో పాటు నితీశ్ కుమార్ ఏం చేయలేకపోయారు కూడా చెబుతున్నారు, ఉదయం 10.05 గంటలకు సీతామఢిలోని రిగా బ్లాక్ లో మొదటి సభ నిర్వహించిన తేజస్వి సాయంత్రం 4.45 గంటలకు తన చివరి సభను వైశాలి ప్రాంతంలోని బిదుపూర్ బ్లాక్ లో నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more