Tejashwi Yadav Slams Nitish Kumar with old video నితిశ్ కుమార్ కు పాత వీడియోతో చెక్ పెట్టిన తేజస్వీ యాదవ్

Bitter elections tejashwi yadav slams nitish kumar with old modi video

Tejashwi Yadav, Chief Minister Nitish Kumar, Bihar assembly election 2020,Bihar election news,bihar election 2020 live updates,bihar election news live updates,bihar assembly election live news,, election meeting, BJP JDU coalition, Muzaffarpur, Bihar, Politics

RJD leader Tejashwi Yadav's 10 lakh jobs promise has come under fierce attack from ex-ally - Nitish Kumar - the BJP, which is ruling in coalition with the JDU chief, has also promised 19 lakh jobs. The RJD is trying to attack the Chief Minister and the NDA over comments made in the past when the two were contesting against each other.

నితిశ్ కుమార్ కు పాత వీడియోతో చెక్ పెట్టిన తేజస్వీ యాదవ్

Posted: 10/31/2020 07:09 PM IST
Bitter elections tejashwi yadav slams nitish kumar with old modi video

గత మూడు పర్యాయాలుగా బీహార్ పై తనదైన ముద్రవేసుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఈ పర్యాయం ఎన్నికలలో కాసింత వ్యతిరేక గాలి ఎదురవుతోంది. ఆర్జీడి యువనేత తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో హేమాహేలీలతో తలపడుతూ తన తండ్రి బాటలో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. తమతో కలసి గత ఎన్నికలలో మహా కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తరువాత మహాకూటమి పక్షాలకు వెన్నుపోటు పొడిచి బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఇక పదవీ కాలం ముగియడంతో మరోమారు ప్రజల ముందుకు వెళ్తున్న ఆయనను తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో ఎదుర్కోంటున్నారు. ఈ క్రమంలో గత ఐదేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై చేసిన అరోపణల వీడియోలను ఈసారి ఆయన బీహార్ ప్రజలతో పంచుకుని ఈ రెండు పార్టీలపై విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ సారి కూడా బీజేపీ, జేడీయూలు ఒక కూటమిగా బరిలోకి దిగగా... కాంగ్రెస్ తో కలిసి ఆర్జేడీ మహాకూటమిని ఏర్పాటు చేసింది. ఓ వైపు నితీశ్ కుమార్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ నిప్పులు చెరుగుతూనే... 'తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం' వంటి పలు ప్రజాకర్షక వాగ్దానాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, తేజశ్వి సభలకు జనాలు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఎన్నికల పర్వం టెన్షన్ ను మరింత పెంచుతోంది. నితీశ్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు తేజశ్వి అన్ని అస్త్రాలను వాడుతున్నారు. జేడీయూ ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల కంటే ఎక్కువ ఉన్న దాదాపు 60 కుంభకోణాలు చేసిందని ఈ ఉదయం ఆరోపించారు.

దీనికి సంబంధించి ఓ వీడియో సాక్ష్యాన్ని ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. నితీశ్ ప్రభుత్వం 30కి పైగా స్కాములు చేసిందని ప్రధాని మోదీ గతంలో విమర్శించిన వీడియోను ఈరోజు ఆయన జనాలకు చూపించారు. గతంలో బీజేపీకి వ్యతిరేక పక్షంగా జేడీయూ ఉన్నప్పుడు మోదీ ఈ విమర్శలు గుప్పించారు. ఎప్పుడో మోదీ మాట్లాడిన వీడియోను ఈరోజు తేజశ్వి ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేశారు. 'గౌరవనీయులైన నితీశ్ గారూ... 60కి పైగా స్కాములను మీ ప్రభుత్వం చేసింది. వీటిలో 33 స్కాముల గురించి ఐదేళ్ల క్రితమే ప్రధాని మోదీ మాట్లాడారు. ఆనాడు మోదీ మాట్లాడిన మాటలను మీరు కూడా వినండి' అని తేజస్వీ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles