Urmila Matondkar To Be Nominated As MLC చట్టసభలోకి బాలీవుడ్ నటి, ఎమ్మెల్సీ బరిలో ఉర్మిళ మతోండ్కర్.!

Shiv sena has picked urmila matondkar for mlc seat

Urmila matondkar,Urmila Matondkar shiv sena, Urmila Matondkar legislative council, Urmila Matondkar sena, Urmila Matondkar maharashtra legislative council, maharashtra legislative council nominations, shiv sena, member of legislatvie coundil, MLC, Bollywood, Congress leader, Maharashtra, Politics

The Shiv Sena has picked Urmila Matondkar for nomination to the state legislative council with the Uddhav Thackeray-led Maha Vikas Aghadi set to recommend the 46-year-old actor’s name along with 11 others to the Governor.

చట్టసభలోకి బాలీవుడ్ నటి, ఎమ్మెల్సీ బరిలో ఉర్మిళ మతోండ్కర్.!

Posted: 10/31/2020 06:14 PM IST
Shiv sena has picked urmila matondkar for mlc seat

పార్లమెంటులోకి అడుగుపెట్టాలని మహారాష్ట్ర నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కు పరాభవం ఎదురైనా.. ఈ ధఫా చట్టసభలోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారారైంది. మహారాష్ట్రలోని అధికార శివసేన అమెను చట్టసభలోకి తీసుకువచ్చేందుకు పావులను కదిపింది. అదేంటి కాంగ్రెస్ నాయకురాలిగా.. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటి చేసిన ఆమెను శివసేన ఎందుకు తమ అభ్యర్థిగా చట్టసభకు పంపాలని భావిస్తోందని అంటున్నారా.? ఇంతకీ అమె ఎవరో అర్థమైందా.? అమె ఉర్మిళ మంటోడ్కర్, లోక్ సభ ఎన్నికలు జరిగిన తరువాత అమె గత ఏడాది సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. తనకు లోక్ సభ ఎన్నికలలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పెద్దలు సైఁహకరించలేదని అమె అరోపించారు.

ఈ మేరకు ఆమె రహస్యంగా ఓ లేఖను కూడా అధిష్టానానికి పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో అమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, ఈ క్రమంలో అప్పటి నుంచి ఇటీవల అధికార శివసేన పార్టీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు, అరోపణలు చేసే వరకు ఉర్మిళ మంటోడ్కర్ పెద్దగా ఉనికి చాటుకోకుండా లో ఫ్రోఫైల్ మెయింటైన్ చేశారు, అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అమెను శివసేన అక్కున చేర్చకుని అమెకు చట్టపభలో స్థానం కల్పించాలని నిర్ణయించింది, ఆమెతో పాటు మరో 11 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించేందుకు వారి జాబితాను రాష్ట్ర గవర్నర్ కు పంపించింది. అయితే ఉర్మిళ పేరును శివసేన ప్రతిపాదించడంపై కాంగ్రెస్ నేతలు కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. తమ పార్టీకి అమె రాజీనామా చేసిందని దీంతో అమెను శివసేన చట్టపభకు పంపుతోందని ఇందులో తమకు అభ్యంతరాలు ఏమీ లేవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

మహారాష్ట్ర శాసనమండలిలో త్వరలో ఖాళీ కానున్న 12 స్థానాలకు గాను గవర్నర్ కోటాలో ఊర్మిళను నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయించారు. నిన్న జరిగిన ‘మహా వికాస్ అఘాడీ’ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కంగనా రనౌత్ విమర్శలు, అరోపణలను అంతే స్థాయిలో బలంగా తిప్పికోట్టిన నేపథ్యంలో ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి అమెను చట్టసభకు నామినేట్ చేయాలని శివసేన భావిస్తోంది. ఈ వార్తలను శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. అయితే, మూడు పార్టీల నేతలతో మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను సీఎంకు పంపుతామని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ జాబితాలో మరాఠీ నటుడు ఆదేష్‌ బండేకర్‌, సింగర్‌ ఆనంద్‌ షిండే, ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ఎన్‌సీపీలో చేరిన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేలు ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles