Samajwadi Party objects to hospital urinal in its flag colour అసుపత్రి మరుగుదోడ్లకు అభ్యంతరకర రంగులు.. దుబార ఖర్చు..

Sp objects to hospital urinal in its flag colour railways gives a fresh coat of white

Samajwadi Party, Lalit Narayan Railway Hospital, Gorakhpur district, SP objects Red and green colours, hospital urinal, SP flag colour, Railways, SP President, Akhilesh Yadav, Rajya Sabha elections, Uttar Pradesh MLC elections, BJP, BSP, Uttar Pradesh, politics

A row erupted after Samajwadi Party (SP) leaders and workers protested against the choice of red and green colours that had been used to paint the urinal of the Lalit Narayan Railway Hospital in the Gorakhpur district. Red and green are the colours that are also used in the Samajwadi Party's flag.

ఆసుపత్రి మరుగుదోడ్లకు పార్టీ రంగులు.. ఎస్సీ అభ్యంతరంతో దిగొచ్చిన రైల్వే..

Posted: 10/30/2020 05:37 PM IST
Sp objects to hospital urinal in its flag colour railways gives a fresh coat of white

ప్రభుత్వ సంస్థలు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తాయన్నది ప్రజల్లో వున్న అభిప్రాయం. ప్రభుత్వ కాంట్రాక్టు కింద పోందిన పని.. లోపభూయిష్టంగా వుండటంతో పాటు అందుకు అయ్యే ఖర్చు మాత్రం అధికంగా వుంటుందని, అదే పనిని వ్యక్తులు తమకు తాముగా చేసుకుంటే తక్కువలోనే అవుతుందన్న అభిప్రాయం ఒకటుంది. ఇదీ కాకుండా చేసిన పనినే మళ్లి మళ్లీ చేసి దుబారా ఖర్చు కూడా పెట్టేస్తారన్నది కూడా తెలిసిందే. అచ్చంగా అలాంటిదే జరిగిందీ ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో. అయితే దుబారా ఖర్చు చేసింది మాత్రం ప్రజలకు నీతి సూక్తులు చెప్పే రైల్వే శాఖ కావడం గమనార్హం. ఇక్కడ దుబారా ఖర్చు మాత్రమే కాదు ఏకంగా వివాదానికి దారితీసేలా రంగుల వినియమం జరిగింది.

గోరఖ్ పూర్ జిల్లాలో వున్న లలిత్ నారాయణ్ రైల్వే ఆసుపత్రి మరుగుదొడ్లకు స్థానిక రైల్వే కాంట్రాక్టరు ఎరుపు, ఆకుపచ్చ రంగులను వినియోగించడం వివాదానికి దారి తీసింది. ఈ రంగులు తమ పార్టీ రంగులని.. వాటిని మరుగుదోడ్లకు ఎలా వేస్తారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు స్థానిక అధికారులపై సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది. తమ పార్టీ రంగులను మరుగుడ్లకు వాడడం కేవలం అధికార పార్టీ ప్రోద్భలంతోనే జరిగిందని అరోపించిన ఎస్సీ నేతలు.. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గోరఖ్ పూర్ ఎస్సీ నేతల బృందం ఒకటి స్థానిక రైల్వే అధికారులను కలిసి కోరింది.

అధికార పార్టీ కలుషిత మనస్తత్వం ఎలాంటిదన్న విషయం రైల్వే అసుపత్రి మరుగుదోడ్లకు తమ పార్టీ రంగులను వేయడం ద్వారా తేటతెల్లం అయ్యిందని సమాజ్ వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పనిచేశారని విమర్శించింది. రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీ రంగులను మరుగుదొడ్లకు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రంగులు మార్చడమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. నాలుగు నెలల క్రితమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండు రోజుల క్రితమే రంగుల విషయం తమ దృష్టికి వచ్చిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్ నాగిన సాహిని పేర్కొన్నారు.

ఎస్పీ పోస్టుపై ఈశాన్య రైల్వే స్పందించింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రైల్వే ఆసుపత్రిలో వున్న సంవత్సరాల క్రితం నాటి టైల్స్ ను, మరుగుదొడ్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే వాటిని వేసినట్టు పేర్కొంది. ఈ విషయంలో ఏ పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. అయితే, మళ్లీ ఏమైందో కానీ సాయంత్రానికే రంగులు మార్చారు. ఎరుపు, ఆకుపచ్చ టైల్స్‌పై తెలుపు రంగు వేసినట్టు రైల్వేకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టాయిలెట్ల గోడలపై ఎస్పీ కార్యకర్తలు నల్లరంగు పూయడంతో తాము తెలుపు రంగు వేయాల్సి వచ్చిందన్నారు. కాగా, తమ పార్టీ కార్యకర్తలు నల్లరంగు వేశారన్న ఆరోపణలను ఎస్పీ గోరఖ్‌పూర్ మహానగర్ చీఫ్ ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles