Bunny festival celebrated despite police restrictions పోలీసుల వ్యూహాలకు చెక్.. ఘనంగా బన్ని ఉత్సవాలు

Devaragattu bunny festival celebrated despite police restrictions 50 injured

coronavirus, covid -19, Kurnool stick fight, Devaragattu, Bunny festival, Neraniki, Neranikitanda, Kothapeta, Suluvai villages, Swami Kalyanotsavam, ceremonial idols, stick fight kurnool police, police restrictions, andhra pradesh

Despite the police restrictions, the people of Devaragattu village in Kurnool had crossed the bushes and reached the spot where the Bunny festival will be held every year. Devaragattu, which was under police control till ten o'clock on Monday night, suddenly turned into a mob and the annual Bunny Festival continued as usual.

పోలీసుల వ్యూహాలకు చెక్.. ఘనంగా బన్ని ఉత్సవాలు

Posted: 10/27/2020 09:58 PM IST
Devaragattu bunny festival celebrated despite police restrictions 50 injured

దసరా పండుగ పర్వదినం ముగిసిన మరుసటి రోజునే కర్నూలు జిల్లా దేవరగట్టులో స్థానిక పల్లె ప్రజలతో జనసందోహం మధ్య బన్ని ఉత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. కర్రలలను చేతబట్టిన పలు గ్రామాల ప్రజలు ఒకరిపై మరోకరు దాడులకు పాల్పడుతూ ఉత్సవాన్ని చేసుకోవడం ఇక్కడ అనవాయితి. ఇక్కడి కోట ప్రాంతంలో స్వామివారి కళ్యాణోత్సవం ముగిసిన వెంటనే ఉత్సవమూర్తులను తీసుకెళ్లే ప్రక్రియలో ఒక గ్రామంతో మరో గ్రామం, ఇలా స్థానిక గ్రామాల ప్రజలు మూకలుగా ఏర్పడి కర్రెలతో ప్రత్యర్థి గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడుతుంటారు. స్వామి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకువచ్చిన సింహసనకట్ట వద్ద ఉంచారు, అక్కడి నుంచి భక్తులు విగ్రహఆలకు కర్రలు అడ్డుగా ఉంచి రాక్షసపడ వరకు తీసుకువెళ్లారు, ఇలా జరిగే ఉత్సవాల్లో పలువురు తీవ్రంగా, అనేక మంది స్వల్పంగా గాయాలపాలు కావడం తెలిసిందే.

హింసాత్మకంగా మారిన ఈ బన్ని ఉత్సవాన్ని రద్దు చేయాలని స్థానిక పోలీసులు పలు చర్యలు తీసుకున్నా ఇప్పటికీ ఈ ఉత్సవాలు యధాతధంగా కొనసాగుతూనే వున్నాయి, తమిళనాడు జల్లికట్టు తరహాలో కర్నూలులోని దేవరగట్టులో బన్నీ ఉత్సవాలకు పెట్టింది పేరు. అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో బన్ని ఉత్సవాలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ముందునుంచి చెబుతూ వచ్చారు, అంతేకాదు దసరా పండగ రోజు నుంచి ఇక్కడ స్థానిక గ్రామాల ప్రజలు గుమ్మిగూడకుండా పటిష్టచర్యలు చేపట్టారు, జిల్లా ఎస్సీ, కలెక్టర్ సహా జిల్లా ఉన్నతాధికారులంతా వందలాది మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు కోట ప్రాంతానికి చేరకోకుండా అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు,

స్థానిక ప్రజలు అధికసంఖ్యలో రాకుండా చెక్ పోస్టుల వద్ద స్థానికులతో కలసి పోలీసులు పికెట్ ఏర్పాటు చేసుకుని దేవరగట్టు గ్రామ ప్రజలను మాత్రమే ఆ గ్రామంలోకి అనుమతించారు. అంతేకాదు పోలీసుల కళ్లుగప్పి ఎక్కడి నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు వీలు లేకుండా సిసిటీవీ కెమరాలను నిఘా కోసం ఏర్పాటు చేశారు. అయినా.. నిఘానేత్రాలు కూడా నమ్మలేని విధంగా రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమైన బన్ని ఉత్సవాలు రాత్రి మూడు గంటల వరకు ఘనంగా సాగాయి, రాత్రి పదిన్నర వరకు అరకోరగా వున్న భక్తులు పదకొండు గంటల సమయం దాటిన వెంటనే ఒక్కసారిగా పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు,

నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సుళువాయి గ్రామాల ప్రజలు దేవరగట్టుకు చేరకుని కర్రల చేతబట్టి సమరానికి తాము సిద్దం అని నినదించే సరికి అప్పటివరకు అంతా తమకు అనుకూలంగా వున్న పరిస్తితలు ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోగా.. పోలీసులు, జిల్లా యంత్రాంగానికి ఏమి చేయాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితికి జారుకున్నారు,  పదకొండు గంటల సమయానికి తేరు బజారు ప్రాంతానికి వందల సంఖ్యలో ప్రజలు చేరుకుని కర్రల సమరానికి సై అన్నారు, ఈ సారి కూడా ఏకంగా 50కి పైగా స్థానికులు కర్రెల సమరంలో గాయాలయ్యాయి, ఇద్దరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు, బన్ని ఉత్సవాలను అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టని చర్యలు.. పన్నిన వ్యూహాలు పూర్తిగా విఫలమయ్యాయి, 30 చెక్ పోస్టులు, 50 సిసి కెమెరాలు ఏర్పాటు చేసినా.. కొండల మార్గంలో వచ్చే భక్తులను అడ్డుకోలేకపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh