Hyderabad to witness light to moderate rain till October 22 మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు..

Weather forecast imd says low pressure over arabian sea intensified into depression

Rain logjam, houses drowned with rain water, Uppal TRS MLA, rains in hyderabad, colonies flooded with Rain, MLA Subash Reddy, telangana weather, low pressure, deep depression, andhra pradesh weather, rains in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, weather forecast, Telangana, Andhra Pradesh

The Met department forecast thundershowers at most places in Telangana over the next four days, accompanied by lightning. Heavy rain is very likely to occur at isolated places in Telangana districts on Monday. 'Heavy to very heavy rain is likely to occur at isolated places in south Telangana districts,' said a Met official.

అలర్ట్: అక్టోబర్ 22 వరకు హైదరాబాద్ ను వీడని వర్షాలు..

Posted: 10/18/2020 01:45 AM IST
Weather forecast imd says low pressure over arabian sea intensified into depression

(Image source from: Siasat.com)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చి తీరం దాటిన క్రమంలో కురిసిన వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీభత్సం సృష్టించాయి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇరవై ఏళ్ల క్రితం వరుణుడు చేసిన కల్లోలాన్ని గుర్తుచేశాయి, గత మూడు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరంలోని ప్రతీ ప్రాంతం జలమయం అయ్యింది. రోడ్లు చెరువులను తలపించాయి, లోతట్టు ప్రాంతాలు నిండా మునిగిపోయాయి, ఇళ్లలో ఆహరాధన్యాలతో పాటు కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి, ఈ నేపథ్యంలో నగరంలోని పలు అపార్టుమెంట్లలో కూడా నీరు నిలిచిపోయి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది, అత్యవసర పరిస్థితులపై బయటకు వెళ్లిన వారి కోసం కుటుంబసభ్యులు వేయికళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

ఇలాంటి సమయంలోనూ వరుణుడు హైదరాబాద్ నగరంపై మరోమారు కన్నెర్ర చేస్తున్నాడు. ప్రతీ రోజు నగరంపై తన ఉగ్రరూపాన్ని దాల్చతున్నాడు. ఇప్పటికే వరద నీటితో ఇళ్లు, అపార్టుమెంట్లు, కాలనీలు చెరువులను తలపించగా.. నీళ్లు క్రమంగా పోయినా వర్షం పడుతున్న నేపథ్యంలో నగరవాసులు తీవ్ర అందోళనకు గురికావాల్సి వస్తోంది. సరూర్ నగర్, కొత్తపేట, చంపాపేట, మలక్ పేట, చాదర్ ఘాట్, సైదాబాద్, వనస్థలిపురం, కోఠి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ లో కుండపోతగా వర్షం పడుతోంది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడ, నార్సింగ్, గండిపేట్, మణికొండలో గచ్చిబౌలి, చందనాగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షం పడే చాన్సుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇక ఇదే సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి వార్తను వినిపించింది, రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి.. వాయుగుండంగా మారిందని తెలిపింది. దీంతో రాగల 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles