Limited devotees a day allowed for sabarimala Ayyappa Darshan శబరిమల అయ్యప్ప దర్శనానికి పరిమితి సంఖ్యలోనే భక్తులు..

Travancore devaswom board to allow limited devotees a day for sabarimala ayyappa darshan

Sabarimala temple, Sabarimala temple news, Sabarimala temple opening date, Sabarimala temple this year, Sabarimala temple restrictions, Sabarimala temple coronavirus, Sabarimala temple latest, Sabarimala temple november, Sabarimala temple Mandalam, Sabarimala temple Kerala government, Sabarimala temple no entry, Sabarimala temple for outsiders, Sabarimala temple 2020 news, Sabarimala Temple to Open from November 16th with Restrictions

The popular Sabarimala temple in Kerala open its doors for the devotees for Ayyappa Swamy Darshan, During the Season Temple Board allows only limitednumber of devotees. All devotees who undergoes corona test within 48 hours are allowed for darshan, This condition followed during the Mandalam-Makaravilakku season and there are restrictions for the pilgrims.

శబరిమల అయ్యప్ప దర్శనానికి పరిమితి సంఖ్యలోనే భక్తులు..

Posted: 10/18/2020 01:28 AM IST
Travancore devaswom board to allow limited devotees a day for sabarimala ayyappa darshan

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలల్లో భక్తులకు అనుమతి లేకుండా కేవలం అర్చక మహాశయులే మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు ఏడాది పోడుగునా తెరచి వుండే ఆలయాలకు మాత్రమే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు ఇవి పరిమితం అయ్యాయి, ఇదే తరహాలో ప్రసిద్ధ ఆలయం శబరిమలలోనూ భక్తలు దర్శనంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి, మలయాళ నూతన సంవత్సరం విస్సు సందర్బంగా ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మూసివేయబడిని శబరిమలలోని స్వామి ఆయ్యప్ప ఆలయం ఈ సారి మండల పూజ సందర్భంగా తెరుచుకున్నాయి.

ఇదే సమయంలో కేరళలో రెండోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కఠినమైన కరోనా నిబంధనల నడుమ 7 నెలల తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయ తలుపులు.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నాయి,  ఇవాళ్టి నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా.. రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకే కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. వారం ప్రారంభంలో 1000 మంది, వారాంతాల్లో 2 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. వర్చువల్‌ క్యూలో ద్వారా టికెట్లు పోందిన వారికి మాత్రమే దర్శనాన్ని అనుమతిస్తున్నారు, ఇవాళ దర్శనానికి కేవలం 246 మంది మాత్రమే నమోదు చేసుకోవడంతో అధికారులు దర్శనాల సంఖ్యను 250కి కుదించారు.

అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం పక్కా మార్గదర్శకాలను రూపొందించారు ఆలయ అధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని నిబంధన పెట్టారు. ధీంతో పాటు దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని షరతు కూడా విధించారు. వీరికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. స్వామివారికి నెలవారీ పూజలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్‌ 16 నుంచి అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో నెయ్యాభిషేకం, అన్నదానాలను రద్దుచేశారు. అలాగే 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించడం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles