Covid-19: Telangana ex-Home min critical నాయిని ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స..

Former home minister nayini narsimha reddy critical

former home minister nayini narasimha reddy critical, nayini narsimha reddy critical, nayini narsimha reddy hospitalised, COVID-19, Nayini Narsimha Reddy, MLC Nayini Narsimha Reddy, Coronavirus, corona positive, Hyderabad, Telangana, Crime

Former Telangana Home Minister Nayini Narsimha Reddy has been undergoing treatment at a corporate hospital and recently shifted into ICU ward. The MLC had been admitted into hospital after his condition turned turned critical on Tuesday. He is reportedly infected with COVID-19. A team of doctors are monitoring his condition and a series of tests are being performed.

విషమించిన నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స..

Posted: 10/16/2020 04:27 PM IST
Former home minister nayini narsimha reddy critical

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. ఆ తరువాత గత మంగళవారం రోజున ఆయన మరోమారు అనారోగ్యంతో అసుపత్రిలో చేరి చికిత్స పోందుతున్నారు. కాగా ఇవాళ ఆయన అరోగ్య పరిస్థితి మరోమారు విషమించింది. ఆయన శరీరంలో ఆక్సిజన్ స్థాయులు ఒక్కసారిగా పడిపోవడంతో మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అంతకుముందు కరోనా బారినపడిన నాయిని నరసింహారెడ్డి.. గత నెల 28న బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఏకంగా 16 రోజుల చికిత్సతో ఆయన కరోనా బారి నుంచి విముక్తులయ్యారు. అనంతరం నిర్వహించిన పరీక్షలో ఆయనకు కరోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ సమయంలో బాగానే వున్న నాయిని ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాసింత ఇబ్బందులు పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు బలవంతం మీద ఆయన మరోమారు అపోలో అసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.

అయితే, నాయిని నరసింహారెడ్డి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న వైద్యులు పరీక్షలు నిర్వహించగా న్యుమోనియా సోకినట్టు గుర్తించారు. దీనికి తోడు ఆక్సిజన్ స్థాయులు కూడా పడిపోవడంతో వెంటనే వెంటిలేటర్ సాయంతో చికిత్సను అందిస్తున్నారు, కాగా ఇవాళ ఆయన అరోగ్యం మరోమారు విషమించడంతో ఆయనను ఆసుపత్రి వైద్యులు పరిశీలించి చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు, కరోనా బారినపడిన నాయిని భార్య అహల్య బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ అయిన వి. శ్రీనివాసరెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles