Ramdev Baba falls off an elephant while performing yoga ఏనుగు అంబారీపై ఆసనాలు.. కిందపడ్డ బాబా రాందేవ్.!

Baba ramdev falls off elephant while performing yoga video goes viral

Baba Ramdev falling down, baba ramdev news, yoga by ramdev baba, baba ramdev accident, baba ramdev latest news, baba ramdev ke yoga, Baba Ramdev, baba ramdev elephant, baba ramdev falling, baba ramdev yoga asana, viral video

A video of yoga guru Baba Ramdev falling off an elephant while performing yoga has gone viral on social media. This incident is said to have happened when Baba Ramdev was teaching yoga practice to saints at Guru Sharanan's ashram Ramanarati in Mathura.

ఏనుగు అంబారీపై ఆసనాలు.. కిందపడ్డ బాబా రాందేవ్.!

Posted: 10/16/2020 05:51 PM IST
Baba ramdev falls off elephant while performing yoga video goes viral

యోగా గురు బాబా రామ్ దేవ్ కు నూతన ప్రయత్నాలు చేయాలన్న తహతహ అధికంగా వుంటోందన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బాబా రామ్ దేవ్‌ కబడ్డీ పోటీలను ప్రారంభిస్తూ ఏకంగా తాను ఓ క్రీడాకారుడిగా జట్టులో చేరి పోటీపడిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఓ సారి కుస్తీ పోటీలు జరుగుతున్న క్రమంలోనూ ఓ కుస్తీ వీరుడితో తలపడి మారీ అతడిపై విజయాన్ని సాధించాడు. ఇలా ఏదో ఒక వార్తతో తన నిత్య వ్యవహారాల నుంచి కొంత సమయాన్ని తీసుకుని మరీ మీడియాలో హైలెట్ గా మారడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. ఇటీవల బాబా రాందేవ్ కన్నా ఆయన పతాంజలి సంస్థ వైరల్ గా నిలించింది.

కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు తాను ఆయుర్వేద ఔషధాన్ని కనుగొన్నామని చెప్పడంతో ఆ మధ్యకాలంలో పతాంజలి సంస్థకు డిజీసీఐ నోటీసులు ఇచ్చింది. అసలు ఈ మందును ఎక్కడ, ఎలా, ఎవరి పర్యవేక్షణలో తయారు చేశారని, ఎక్కడ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారని కూడా ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేయడంతో ఈ సంస్థ కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది, అయితే చాలా రోజుల తరువాత ఈ సారి మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఓ ఏనుగుపై ఆయన కూర్చొని యోగా చేస్తుండగా.. అదుపుతప్పి కింద పడిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

22 సెకండ్ల ఈ వీడియోలో రాందేవ్‌ బాబా ఏనుగుపై కూర్చొని ఆశ్రమంలోని వ్యక్తులకు యోగాసనాలు నేర్పిస్తున్నట్లు కనిపించింది. అయితే, ఏనుగు ఒక్కసారిగా పక్కకి కదలడంతో దానిపై కూర్చున్న రాందేవ్‌ బాబా అదుపుతప్పి కిందపడ్డారు. అయితే కిందపడే సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆయన దూకే ప్రయత్నం చేశారు. ఈ కుదపుకు ఏనుగు ఆయనకు ఎలాంటి హాని తలపెట్టకుండా మావటి దాని తొండం వద్దకు వెళ్లండంతో గజరాజు మిన్నకుండిపోయింది. ఈ కిందపడిన బాబా రాందేవ్.. లేచిలేవంగానే.. ఏనుగు అటుఇటూ కదులుతూ తన యోగాసనానికి విఘాతం కలిగించిందని అక్కడి నిర్వహకులతో చెప్పిన ఆయన దుమ్ము దులుపుకొని నవ్వుతూ నడిచివెళ్లారు.

కాగా ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదు. దీంతో అక్కడి ఆశ్రమవాసులు ఆయనను అతిధిగృహంలోకి తీసుకెళ్లారు. ఏనుగు అంబారీపై ఆసనాలు వేస్తూ కిందపడ్డ రాందేవ్‌ బాబా వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలోని రమణారటి ప్రాంతంలోని గురు శరణన్ ఆశ్రమంలో జరిగింది. అయితే నెట్టింట్లో బాబా రాందేవ్ వీడియోపై నెటిజనులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. బాల్యంలో చిన్నారులు చేసే విధంగా ఇప్పటీకీబాబా రాందేవ్‌ చేయడం విడ్డూరంగా వుందని కొందరు అంటుండగా, ఏనుగు కదలడానికి బాబా ఏం చేశారంటూ మరికొందరు ప్రశ్నించారు. ఇక ఇంతకు సంబంధించి ఇలాంటి వీడియోనే ఆగస్టు నెలలో వైరల్‌ అయ్యింది. సైకిల్‌పై వెళ్తూ ఆయన ఫౌంటేన్‌ వద్ద జారి పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh