TTD hold meetings on Srivari Brahmotsavam శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు.. మరికొన్ని కీలక నిర్ణయాలు..

Ttd hold meetings on performing srivari brahmotsavam solitarily

Srivari Brahmotsavam, TTD, SVR Arts College, Tirumala Tirupati Temple, YV Subba reddy, TTD Board Chairman, Tirupati, TTD News, Tirupati News, Tirupati latest news, Andhra Pradesh

TTD approves to hold the Srivari Brahmotsavas in solitude from October 16th onwards during the Auspicious Ashwayuja month. Brahmotsavam will be held in private from October 16 to 25.

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ సమాలోచనలు..

Posted: 10/12/2020 09:43 PM IST
Ttd hold meetings on performing srivari brahmotsavam solitarily

(Image source from: telugu.oneindia.com)

కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలకు దేశవిదేశాల నుంచి ఎందరెందరో భక్తులు వచ్చి తిరుమాడ వీధుల్లో అభయప్రధానం చేసే శ్రీవారిని దర్శించుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అధిక మాసం రావడంతో భక్తజనకోటి ఇలవేల్పుకు రెండు పర్యాయాలు బ్రహోత్సవాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికమాసంలో గత నెల 19 నుంచి 28 వరకు ఓ పర్యాయం సాలకట్ల బ్రహోత్సవాలను నిర్వహించిన తరుణంలో అక్టోబర్ మాసంలో మరోమారు 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా ఏర్పాట్లను చేస్తోంది.  

కన్నుల పండవగా సాగే ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఎలా నిర్వహించాలన్న విషయమై ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. కరోనా నిబంధనలకు లోబడి సాలకట్ల బ్రహోత్సవాలను నిర్వహించినట్లుగానే భక్తజనకోటికి దూరంగా జరపాలా.? లేక భక్తుల కొంగుబంగారమైన దేవదేవుడి బ్రహోత్సవాలను భక్తులందరూ వీక్షించేలా జరపించాలా అన్న విషయంలో ఇంకా టీటీడీ కమిటీలో తర్జనభర్జన జరుగుతోందని సమాచారం. దేవదేవుడి బ్రహోత్సవాలను ఏకంతంగా నిర్వహించడంపై ఇప్పటికే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రమంలో తీరుమాడ వీధుల్లో నిర్వహించే విషయమై టీటీడీ తమ సభ్యులతో సమాలోచనలు జరుపుతోందని తెలుస్తోంది.

టీటీడీ నూతన ఈఓగా రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి., అటు భక్తులను కూడా సంతృప్తిపర్చేలా తుది నిర్ణయం తీసుకోవాలన్నే యోచనలో వున్నారు, ఇ:దుకోసం ఆయన ఇప్పటికే పలువురు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. వాస్తవానికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 16న ప్రారంభమై, 24 వరకూ జరగాల్సి వుంది. ఈ ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలన్న ఆలోచనతో ఆలయం చుట్టూ ఉన్న గ్యాలరీల్లో భక్తులు కూర్చోవాల్సిన స్థానాలను నిర్దేశిస్తూ, మార్కింగ్స్ కూడా వేశారు. ఇక ఇప్పటికే అలిపిరి వద్దే అనుమతి వున్న భక్తులను మాత్రమే కొండపైకి పంపేందుకు కూడా నిర్ణయం తీసుకున్నామని అదేశాలను జారీ చేశారు.

ఈ పనులను పరిశీలించిన ఈఓ జవహార్ రెడ్డి, ఆపై భౌతికదూరం అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. భక్తులకు సంతృప్తిపర్చడంతో పాటు కోవిడ్ నిబంధనలను అమలుపర్చేలా నిర్ణయాలు తీసుకోవాలని అదేశించారు. ఈ మేరకు తనకు సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించారని సమాచారం. కరోనా ఇంకా నియంత్రణలోకి రాని ఈ పరిస్థితుల్లో, వాహన సేవలను మాడ వీధుల్లో భక్తుల మధ్య నిర్వహించడం ప్రమాదకరమని, ఎవరిలోనైనా వైరస్ ఉంటే, అది ఎంతో మందికి సోకే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో భక్తులు లేకుండా, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అన్ని పరిస్థితులనూ సమీక్షించిన తరువాత, బ్రహ్మోత్సవాల నిర్వహణపై త్వరలోనే టీటీడీ ఓ సముచిత నిర్ణయాన్ని తీసుకోనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles