Chicken rates surge as demand resumes in Telangana అకాశాన్నంటుతున్న చికెన్ ధర.. అదేబాటలో కోడిగుడ్లు..

Chicken rates surge as demand resumes in telangana

Eggs, Egg price, crore chicks, Chicken rates surge, Chicken rates, Chicken, skinless chicken, boneless chicken, Telangana Poultry Federation (TPF), Poultry Equipment Manufacturers Association (IPEMA), Errabelli Pradeep Rao, Telangana

Increased consumption of chicken coupled with reduced production has led to hike in chicken prices across the state. For the past few days, the price of chicken has been in the range of Rs 250 to Rs 280 per kg (skinless) and the average chicken price ranges from Rs 160 to Rs 180 per kg. On Sunday, chicken (skinless) was sold at Rs 320 per kg.

అకాశాన్నంటుతున్న చికెన్ ధర.. అదేబాటలో కోడిగుడ్లు..

Posted: 10/12/2020 09:17 PM IST
Chicken rates surge as demand resumes in telangana

(Image source from: Newindianexpress.com)

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కోడి మాంసంతోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న పుకార్ల నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో విక్రయాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఇక ఉచితంగా ఇస్తామన్నా కోడి మాంసం కోనేవారు లేకుండా కొన్నివారాల పాటు వెలవెలబోయిన దుకాణాలు ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో కోడి మాంసం ధర ఆకాశాన్ని అంటుతున్నా దుకాణాలు ముందు రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఆరు నెలల కిత్రం ఉచితంగా ఇచ్చినా తీసుకునే వారు లేక  లేక తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారంలోని కోళ్లను మేపడం ఖర్చులు కూడా రావడం లేదని బోరుమాన్నారు. చివరకు స్థానిక గ్రామాల్లో ఉచితంగా పంచిపెట్టిన ఘటనలు కూడా వున్నాయి, అలాంటిది ప్రస్తుతం మాత్రం కోడిమాంసంతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా మండుతున్నాయి.

ఆదివారం కిలో ధర గరిష్ఠంగా 280 వరకూ ధర పలికిన చికెన్ ధర ఆకాశాన్ని అంటింది. మే నెలలో కిలో 150 ధరల పలికిన చికెన్ నెల నెలా కొంత పెరుగుతూ వచ్చి ఏకంగా గత నెలరోజుల్లోనే కిలోకు రూ.50 మేర పెరగడం కోడిమాంసం ప్రియులను నోరారా తీనే వీలుకూడా లేకుండా చేసింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో చికెన్ తినడం వల్ల రోగనిరోధకశక్తి (ఇమ్యూనిటీ) పెరుగుతోందని ఓ వైపు వైద్యులు (డైటీషియన్లు) మరోవైపు ప్రభుత్వాలు కూడా సూచించిన నేపథ్యంలో చికెన్‌, కోడిగుడ్ల వినియోగం దేశవ్యాప్తంగా బాగా పెరిగింది. ఈ తరుణంలో లాక్ డౌన్‌ ప్రారంభానికి ముందు వారానికి ఒకసారి చికెన్‌ తిన్న కుటుంబాలు ఇప్పుడు 2, 3 సార్లు కొంటున్నాయని విక్రేతలు తెలిపారు. చికెన్‌, గుడ్లతో పాటు చేపలు, మాంసం వినియోగం బాగా పెరిగి, అమ్మకాలు ఇప్పుడు గరిష్ఠస్థాయికి చేరాయి.

లాక్ డౌన్ సహా వర్క్ ఫ్రం హోం కూడా కోడిమాంసం విక్రయాలకు బాగా దోహదం చేస్తున్నాయని చెప్పారు. ఇక ఈ విక్రయాలకు తోడు కు ముందు రోజుకు 1.80 కోట్ల గుడ్ల అమ్మకాలుండేవి. ఇప్పుడు రోజుకు 2 కోట్ల గుడ్లు అమ్ముతున్నారు. అయినా గుడ్డు ధర చిల్లర మార్కెట్‌లో రూ.5 నుంచి 6కి చేరింది. అదే ఒరవడిలో అటు చికెన్ ధర కూడా ఏకంగా రూ.280 కి చేరింది. స్కిన్ లెస్ చికెన్ ధర మూడు వందల పైన పలుకగా, బోన్ లెస్ చికెన్ ధర మాత్రం ఏంకగా ఐదు వందల ధర పలికింది. నాటు కోడి మాంసం కూడా ఏకంగా 450 దర పలకడం కోడిమాంస ప్రియులను అందోళనకు గురిచేస్తోంది. ఇళ్లలో గుడ్లు, చికెన్‌ వినియోగం పెరిగినందున ధరలూ పెరుగుతున్నాయని అది స్వల్పకాలమే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ కోళ్ల పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు  చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles