Local body elections: AP High Court issues notice to SEC రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు హైకోర్టు నోటీసులు

Local body elections ap high court issues notice to sec

Local body elections, AP SEC, State Election Commission, Nimmagadda Ramesh Kumar, YSRCP, State Assembly Elections, AP High Court, Polictics

The Andhra Pradesh High Court asked the YSRCP government as to why it was not possible when Assembly elections are being held in other states. It served notice to the State Election Commission (SEC) seeking its response on holding the local body polls and adjourned the hearing to November 2.

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు హైకోర్టు నోటీసులు

Posted: 10/09/2020 09:27 PM IST
Local body elections ap high court issues notice to sec

కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన నేపథ్యంలో మార్చి నుంచి పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుని చివరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా మార్పుకు కూడా కారణమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సమాధానాలు విన్న న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నించింది, బీహార్ శాసనసభకు ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసందే.

దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా వున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు వచ్చే నెల (నవంబర్) 10వ తేదీన వెల్లడి కానున్నాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ దాఖలు చేసిన పిటీషన్ పై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఈ సందర్భంగా ఏఫీ ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.

ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై విస్మయాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో అభ్యంతరమేంటని ప్రశ్నించింది. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలపాలని ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పిటీషన్ పై తదుపరి విచారణను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నవంబరు 2కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles