TTD issues Special Seva tickets and Special tickets for Srivari Darshan తిరుమల శ్రీవారి ప్రత్యేక ధర్శనం, సేవా టిక్కెట్ల కోటా వివరాలు..

Ttd issues special seva tickets and special tickets for srivari darshan

Srivari Kalyanostavam, TTD, kalyanam devotees, supatham, free darshan, digital kalyan seva, Tirumala Tirupati Temple, YV Subba reddy, TTD Board Chairman, Tirupati, TTD News, Tirupati News, Tirupati latest news, Andhra Pradesh, devotional

The Tirumala Tirupati Devasthanam has released the special seva quota for the bramhostavam including special seva tickets and special tickets for the diety Lord Sri Venkateshwara swamy darshan

తిరుమల శ్రీవారి ప్రత్యేక ధర్శనం, సేవా టిక్కెట్ల కోటా వివరాలు..

Posted: 10/09/2020 09:02 PM IST
Ttd issues special seva tickets and special tickets for srivari darshan

కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామికి దర్శనానికి క్రమంగా భక్తుజనకోటి క్యూకడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఇక ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా పునరుద్దరించే పనిలో పడిన తిరుమల తిరుపతి బోర్డు.. భక్తులకు అందుబాటులోకి పలు సేవలను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో తిరుమల తీరుపతి దేవస్థానం బోర్డు బ్రహోత్సవాల సమయంలో భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతించేందుకు కూడా చర్యలు తీసుకుంది, ఈ క్రమంలో అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు చర్యలను చేపట్టింది.

ఈ క్రమంలో ఇప్పటికే గత నెల సెప్టెంబర్ 7 నుంచి డిజిటల్ కళ్యాణోత్సవం సేవను తాత్కాలికంగా రద్దు చేసిన టీటీడీ,. ఈ నెల 26 నుంచి మళ్లీ కళ్యాణోత్సవ సేవను శ్రీవారి భక్తజనకోటికి అందుబాటులోకి తీసుకురానుంది, ఇందుక సంబంధించిన టిక్కెట్లను కూడా అప్పటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపింది, కాగా, రోజుకు కేవలం పరిమిత సంఖ్యలోనే కేవలం వెయ్యి టికెట్లను మాత్రమే విక్రయించనున్నామని కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు,ఇక తాజాగా కోటా నేపథ్యంలో టీటీడీ వెబ్ సైట్ లో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ప్రవేశ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు, ఉత్సవాలకు సంబంధించిన టీటీడీ ప్రత్యేక దర్శన కోటాను విడుదల చేశారు,

శ్రీవారి బ్రహోత్సవాల వేడుకల నేపథ్యంలో ప్రతీ రోజు పదిహేను స్లాట్ లలో 16 వేట టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది, టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే బ్రహ్మోత్సవాల సమయంలో కోండపైకి పంపనున్నారు. అలిపిరి వద్ద చెక్ పాయింట్ లో భక్తుల ప్రత్యేక దర్శన కోటాను పరిశీలించనున్న ఆలయ అధికారులు వారిని మాత్రమే సంబంధిత సమయంలో కోండపైకి అనుమతించనున్నారు. శ్రీవారి మూలవిరాట్టు దర్శనంతో పాటు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సూర్య, చంద్ర, హనుమ, గరుడ, మొదలగు వాహనాలపై తిరుమాడ వీధుల్లో తిరిగే కలియుగ శ్రీవెంకటేశ్వర స్వామి అభయప్రధానాన్ని కూడా వీక్షించేందుకు భక్తులకు అనుమతించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles