Study of Covid Cases offers Surprises to Scientists కరోనా వైరస్ వ్యాప్తి చెందని వ్యాధా.?

Covid 19 spread in some unique ways in india new contact tracing data shows

Covid-19, coronavirus, SARS-CoV2, Covid infections, Covid symptoms, Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs

Over 70% of those who contract covid-19 do not pass it any further, while a minority act as superspreaders, the first detailed study of SARS-CoV2 transmission patterns in India has shown.

కరోనా వైరస్ వ్యాప్తిపై విస్మయంగోలిపే అధ్యయన అంశాలు

Posted: 10/01/2020 07:57 PM IST
Covid 19 spread in some unique ways in india new contact tracing data shows

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి.. గురించి నెలలు గడుస్తున్న కోద్దీ తాజా విషయాలు బయటకు వస్తున్నాయి, కరోనా మహమ్మారి అందరినీ తన వాహకాలు (క్యారియర్లు)గా చేసుకోదని తాజాగా అధ్యయాల్లో తేలింది. అయితే వ్యాధి గురించి ముందుగా తెలియని క్రమంలో భయంతోనే అనేక మంది అసువులు బాసారని సోషల్ మీడియా పోస్టులు ఇప్పటికే వైరల్ గా మారాయి. కరోనా బారిన పడి మరణించిన వారిలో దీర్ఘకాలిక శ్వాసకోశ, హృదయ, మధుమేహం సంబంధ వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్న విషయం తెలిసిందే. ఇక దాదాపుగా ఏలాంటి వ్యాధుల బారిన పడినవారు కూడా వైరస్ ప్రభావానికి గురై చికిత్సలతో అరోగ్యవంతులుగా బయటపడుతున్నారు.

ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ లో రికవరీ రేటు అధికంగా వుందన్న విషయం కూడా తెలిసిందే. అదే సమయంలో కరోనా భయంకరమైన అంటు వ్యాధని, ఏకంగా ఆరు మీటర్ల దూరం వున్నా దాని బారిన పడిన రోగుల నుంచి అది ఇతరులకు సోకంతుందని అధ్యయనాలు వెల్డించిన తరుణంలో ఇటు మన దేశంలో మాత్రం అది అంత ప్రభావం చూపడం లేదని స్పష్టం అవుతోంది, ఇక ఇది అంటువ్యాధే అయినా.. దాని ప్రభావం కూడా కొంత మేరకే అని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడికి కరోనా సోకినా.. లక్షణాలు బయటపడి ఆయన టెస్టు చేయించుకున్న తరువాత పాజిటివ్ అని తేలిన సందర్భంలోనూ ఆ ఇంటిలోని మిగతా సభ్యులు కరోనా బారిన పడటం లేదు. దీంతో కరోనా అంటువ్యాధి ఎలా అవుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే పరిస్థితి అంతటా కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం బారిన వారిలో 70 శాతం మంది నుంచి ఇది ఎవరికీ సంక్రమించలేదని, అసలు వారి నుంచి ఇతరులకు వ్యాధి సోకలేదని అధ్యయనంలో తేలింది. అయితే కొంతమందిని మాత్రమే వాహకాలుగా చేసుకున్న ఈ వైరస్.. వారి నుంచే ఇతరలకు వ్యాప్తి తాజా అధ్యయనంలో స్పష్టమైంది.  కరోనా వైరస్ వ్యాప్తిపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ సంస్థ తమిళనాడు, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాంటాక్టు కేసుల వివరాలను అధ్యయనం చేసిన తరువాత ఈ వివరాలను వెల్లడించింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ సంస్థ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని రీసెర్చర్ల బృందం.. ఏపీ, తమిళనాడుల్లో 4.35 లక్షలకు పైగా కేసులతో పాటు వారితో కాంటాక్టులో వున్న వారి సుమారు 30 లక్షల మందిని పరిశీలించిన తరువాత ఈ మేరకు వివరాలను వెల్లడించారు, కోవిడ్ కేసులతో కాంటాక్టు అయినవారిలో అత్యధికులకు వైరస్ సోకలేదని నిర్ధారించారు. ఇండియాలో వినూత్న మార్గాల్లో వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు.

కేవలం తమిళనాడు, అంద్రప్రదేశ్ రాష్ట్రాల డాటాను మాత్రమే అధ్యయనం చేసిన ఈ సంస్థ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితిపై మాత్రం పూర్తి గణాంకాలను పొందుపర్చలేదు, మొత్తంగా 84,965 మంది కరోనా రోగులతో పాటు వారితో కాంటాక్ట్ అయిన 5.75 లక్షల మందికి పైగా ప్రజల ల్యాబ్ రిజల్ట్స్, ఎపిడెమోలాజికల్ సమాచారాన్ని క్రోఢీకరించామని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణన్ తెలిపారు. దీంతో ఇప్పుడు మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది, కరోనా వైరస్ ఏ మార్గాల్లో వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని కనుగోనాల్సిన అవశ్యకత కూడా ఏర్పడింది, ఇప్పటికే ఎసింప్టమెటిక్ కేసుల్లో వైరస్ లోడ్డు అధికంగా వుంటుందని తేలిన నేపథ్యంలో వీరే కరోనాకు వ్యాప్తికి వాహకాలుగా మారుతున్నారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Covid-19  coronavirus  SARS-CoV2  Covid infections  Covid symptoms  Coronavirus cases India  

Other Articles