ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పట్నించి మరో లెక్క అని చెప్పాలంటే సరిగ్గా అక్టోబర్ 1కి అంతటి ప్రాముఖ్యత వుంది. ఎందుకంటే ఈ నెల నుంచి అత్యంత ముఖ్యమైన 7 కీలక అంశాలలో మార్పులను చోటుచేసుకుంటున్నాయి. ఇవి దేశ సామాన్య ప్రజల జీవిత గమనంపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. డ్రైవింగ్ లైసెన్స్ మొదలు బ్యాంకుల నుంచి పోందే రుణాల వరుకు, టీవీల కోనుగోళ్ల నుంచి ఆరోగ్య బీమా వరకూ పలు అంశాలలో నూతన నిబంధనలు అమలవనున్నాయి. విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను నుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలను షేర్ చేసుకునే అంశాలపై కూడా దీని ప్రభావం పడనుంది.
1. ఇల్లు, కారు మరియు వ్యక్తిగత రుణాల రేట్లు తగ్గించడం
బ్యాంకులు తమ రిటైల్ మరియు ఎంఎస్‌ఎంఇ రుణాలను ఎక్స్ టర్నల్ వడ్డీ రేటు బెంచ్ మార్క్ లతో అనుసంధానించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తప్పనిసరి చేసింది. దీంతో ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి.
2. ఏడు లక్షలు మించిన చెల్లింపుల మీద టిసిఎస్ విధింపు
ఇక ఇదే అక్టోబర్ 1 నుండి ఆదాయపు పన్ను నిబంధనల్లో కీలక మార్పు కూడా చోటుచేసుకోబోతోంది, ఈ మార్పు నేపథ్యంలో ఇకపై విదేశాలకు పంపించే డబ్బుపై కూడా ఇకపై టిసిఎస్ విధించబడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206 సి (1 జి) కింద, టిసిఎస్ పరిధిని విస్తరించిన కేంద్రం,, దీంతో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కు కూడా దానిని వర్తింపజేయనుంది. విదేశీయానం, విదేశీ విద్య తదితరాలతో పాటు వారితో పాటు విదేశాలలో పెట్టే ప్రతీ పెట్టుబడి, ఖర్చులపై కూడా ఇకపై టీసీఎస్ విధించబడుతుంది,
3. ఆవ నూనెలో ఏదైనా ఇతర తినదగిన నూనెను కలపడం నిషేధం
ఫుడ్ రెగ్యులేటర్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఐ) దేశంలో ఆవ నూనెతో ఏదైనా తినదగిన నూనెను కలపడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లేఖ రాసింది. ఇందులో, కొత్త నిబంధన ప్రకారం ప్రస్తుతం ఉన్న లైసెన్స్ ను మార్చాలని చెప్పబడింది. ప్రస్తుతం దేశంలో చమురు ఉత్పత్తిదారులకు రెండు తినదగిన నూనెల మిశ్రమాన్ని అనుమతిస్తారు, ఒకటి పరిమాణం 20 శాతం కంటే తక్కువ కాదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. ఇది స్వచ్ఛమైన ఆవ నూనె మరియు స్వచ్ఛమైన తినదగిన నూనె ప్రజలకు చేరేలా చేస్తుంది.
4. కస్టమ్స్ పెరుగుతాయి, టీవీ కొనడం ఖరీదైనది
అక్టోబర్ 1 నుండి టీవీల ధరలకు రెక్కలు వస్తాయి. టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్స్ దిగుమతిపై ఐదు శాతం కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాది మినహాయింపు ఇచ్చింది, ఇది సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. దేశంలో తయారీ దిగుమతుల ఆధారంగా ఎప్పటికీ కొనసాగలేమని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇది 32 అంగుళాల టీవీల ధరను రూ. 600, 42 అంగుళాల ధరలను రూ .1,200 పెరిగి 1,500 కు పెంచుతుందని టీవీ తయారీదారులు అంటున్నారు.
5. యుజి / పిజి రేడియో తరగతులు ప్రారంభం
2020-21 సెషన్ కోసం, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థుల కోసం అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ప్రతిరోజూ ఆల్ ఇండియా రేడియో ద్వారా ఉపన్యాసాలు ప్రసారం చేయబడతాయి. అదనంగా, ఆడియో-వీడియో ఉపన్యాసాలు సంబంధిత శాఖ పోర్టల్ లో అప్ లోడ్ చేయబడతాయి.
6. ఫేస్ బుక్ న్యూస్ కంటెంట్ షేరింగ్ పై నిషేధం
సామాజిక మధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ సహా ఇన్ స్టాగ్రామ్ లో వార్తల భాగస్వామ్యం అక్టోబర్ 1 నుండి ఆగిపోనుంది. అక్టోబర్ 1 నుండి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కోసం కొత్త సేవా పరిస్థితి అమలు చేయబడుతోంది. కొత్త సేవా నిబంధనల ప్రకారం, ఫేస్ బుక్ లేదా ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ లో స్థానిక లేదా అంతర్జాతీయ వార్తలను భాగస్వామ్యం చేయకుండా నిషేధించనుంది.
7. ఇ-పోర్టల్, ఇ-చలాన్ ద్వారా వాహన పత్రాల నిర్వహణ.
అక్టోబర్ 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్, ఇ-చలాన్ సహా వాహనాలకు సంబంధించిన కీలక పత్రాల నిర్వహణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోర్టల్ ద్వారా జరుగుతుంది. అనర్హతకు గురైన డ్రైవింగ్ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను “ఈ పోర్టల్”లో ఎప్పటికప్పుడు అప్ డేట్ కానున్నాయి. డ్రైవింగ్ లైసెన్సుల కోసం సంబంధిత మెటార్ వాహనం ఆర్సీ, సహా ఇతర కాయితాల కోసం నిత్యం ట్రాఫిక్ పోలీసులు వీరిని వేధించడానికి కూడా చెక్ పెట్టాలని కేంద్రం యోచించింది. ఇందులో భాగంగా ఈ సేవలను ఐటి సేవలు, ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ వుంటే చాలునని అనుసంధానించింది.
(And get your daily news straight to your inbox)
Mar 05 | కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనాతో కాకవికళమైన దేశప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వ్యాపారం ధోరణితో వ్యవహరిస్తూ వారిని అంతంపాతాళానికి దిగజార్చుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అంటే ట్విట్టర్... Read more
Mar 05 | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కాస్తా రాష్ట్ర స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యమంలో తాము కార్మికుల వైపే వున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ.. బంద్ కు మద్దతు తెలిపింది. అయితే ఇదే సంకేతాలను బలంగా... Read more
Mar 05 | హైదరాబాద్ నగరంతో పాటు అటు రాచకొండ, ఇటు సైబరాబాద్ కమీషనరేట్ ప్రాంతాల్లో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మెట్రో రైలు వచ్చి ట్రాపిక్ సమస్యను కొంతవరకు తీర్చినా.. నానాటికీ పెరుగుతున్న కార్లు, ద్విచక్ర వాహనాల... Read more
Mar 05 | కర్ణాటకకు చెందిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపడంతో మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహరం అంతటితో చల్లబడిందనుకునే తరుణంలో... Read more
Mar 05 | విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ (మార్చి 5న) రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు అనుకూలంగానే... Read more