Pattadar pass books to non agricultural lands వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ పాస్ పుస్తకాలు

Meroon coloured pass books to non agricultural land owners

Telangana Government, meroon colour pass bookd, pattadar pass books, non agricultural lands, land litigations, unnecessary land issues, CM KCR, Telangana

Telangana Government to issue merun colour pattadar pass books to the non agricultural land owners of the state to keep a big fullstop to land litigations ands unnecessary issues.

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ పాస్ పుస్తకాలు

Posted: 09/25/2020 12:46 AM IST
Meroon coloured pass books to non agricultural land owners

రైతు భూములకు పట్టాదార్ పాసుపుస్తకాలను అందించే రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలిసిందే. అయితే దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు కలిగున్న ప్రజలందరికీ మెరూన్‌ కలర్‌ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను జారీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. త్వరలో అమల్లోకి రానున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా మిగతా ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు.

భూ వివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించటంతోపాటు వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించటం కోసమే పాస్‌ పుస్తకాలను జారీ చేయనున్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న ఇండ్లు, ఫామ్ హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటికీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్‌ (మ్యూటేషన్‌) చేయించుకోవాలని సూచించారు.

దీంతో ఇక భవిష్యత్తులో భూముల లావాదేవీలు ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకి బదిలీ చేయాలంటే ధరణి పోర్టల్‌ ద్వారానే అది సాధ్యమవుతుందని (రిజిస్ట్రేషన్‌) తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఇంటి నెంబరు, ఆధార్‌ కార్డుతో సహా కుటుంబ సభ్యుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆస్తుల వివరాలను ఇప్పుడు మ్యుటేషన్‌ చేయించుకోకపోతే భవిష్యత్తులో వాటిని తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. నిరు పేదలు ఎన్నో ఏండ్లుగా ఉంటున్న ఇండ్ల స్థలాలను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్‌ చేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడటంతో పాటు వారికి రుణాలను కూడా పోందే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles