అదృష్టం ఉండాలే కానీ.. కొండలను కూడా బద్దలు కొట్టుకుని వచ్చి వరిస్తుందన్నది నానుడి. ఇలానే ఆయష్సు వుండాలే కానీ ఆకలిగొన్న క్రూరమృగాల మధ్యలోంచి కూడా సురక్షితంగా బయటపడవచ్చు. సరిగ్గా అలాంటిదే ఇప్పుడు మనం చదవబోతున్న వార్త. ఈ రెండేళ్ల బడతడకి ఏం జరుగుతుందో కూడా సరిగ్గా అర్థం చేసుకునే వయస్సు లేకపోయినా.. ఆయుష్పు ఉంది కాబట్టి రెండేళ్ల బుడతడు బతికి బట్టకట్టాడు. అందుకనే చిన్నారులు వున్నప్పుడు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా వుండాలని అంటారు. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో చాలా అప్రమత్తత అవసరం. వారికి ఏమిటీ ఎలా అన్న విషయం తెలియకుండానే వారు ప్రమాదం అంచుకుజారిపోవచ్చు.
మనం మాట్లాడబోతున్న రెండేళ్ల చిన్నారి సోదరుడితో ఆడుకోవడానికి రైల్వేట్రాకులపైకి వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులు తెలిసే వచ్చారో.. లేక తెలియకుండానే ఇక్కడకు చేరుకున్నారో తెలియాదు కానీ.. మృత్యువు ఒడిలోంచి ఓ చిన్నారి తృటిలో తప్పించుకున్నాడు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన లోకోపైలట్లు చిన్నారిని సురక్షితంగా రైల్వేట్రాకులపై నుంచి బయటకు తీసి పిల్లాడి తల్లికి అప్పగించారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఆవహించినా ఘోరం జరిగేది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాబ్ గఢ్ రైల్వే స్టేషన్ కు సమీపంలో 2 ఏళ్ల చిన్నారి తన 14 ఏళ్ల సోదరుడితో కలిసి ఆడుకుంటున్నాడు.
అయితే వారు ఆ సమయంలో రైలు పట్టాల మీద ఉన్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని వదిలిపెట్టి అతని సోదరుడు పక్కకు వెళ్లాడు. సరిగ్గా అదే టైముకు ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే రైలు వచ్చింది. ట్రైన్ కింద చక్రాల మధ్యలో ఆ చిన్నారి ఇరుక్కున్నాడు. దాన్ని గమనించిన లోకో పైలట్ దీవాన్ సింగ్, అతని అసిస్టెంట్ అతుల్ ఆనంద్‌లు వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపారు. అనంతరం రైలు చక్రాల మధ్య చిక్కుకున్న ఆ బాలున్ని వారు రక్షించారు. అప్పటికే బాగా ఏడుస్తున్న ఆ బాలున్ని సముదాయించి నెమ్మదిగా అతన్ని చక్రాల నుంచి బయటకు తీశారు. కాగా ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఆ బాలురు ఇద్దరినీ వారి తల్లికి అప్పగించారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది.
(Video Source: Grupo de medios)
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more