Suspended MPs refuse tea from Rajya Sabha dy chairman రాజ్యసభ ఉపసభాపతి ఛాయ్ ని తిరస్కరించిన ఆ ఎంపీలు..!

Suspended mps on sit in protest refuse tea from rajya sabha deputy chairman

harivansh narayan singh, Rajya Sabha, deputy chairman, Suspended MPs, Congress, Trinamool congress, CPM, Aam Aadmi party, Rajeev satav, Ripuri Bora, Syed Nasir Hussain, Derek O'Brien, Dola Sen, Sanjay singh, KK Ragesh, Elamaram Karim, Parliament lawn, Mahatma Gandhi's statue, Farmers Bill, National Politics

Rajya Sabha deputy chairman Harivansh arrived this with morning tea for the eight opposition members who had spent the night on the lawns of Parliament as part of their indefinite protest after being suspended yesterday over unruly scenes against farm bills inside the Upper House. However, the suspended MPs refused to take tea from Harivansh.

రాజ్యసభ ఉపసభాపతి ఛాయ్ ని తిరస్కరించిన ఆ ఎంపీలు..!

Posted: 09/22/2020 01:51 PM IST
Suspended mps on sit in protest refuse tea from rajya sabha deputy chairman

దేశంలోని రైతులను కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచుతుందని అరోపిస్తూ వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన వేళ, రైతుల పక్షాన నిలిచిన విపక్షాలకు చెందిన ఎనమిది మంది ఎంపీలు మరో అడుగుముందుకేసీ పోడియంలోకి దూసుకెళ్లి మరీ తమ నిరసన తెలిపిన విషయం తెలిసిందే. రైతులకు అన్యాయం జరిగితే సహించమని, నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని రైతుల భూములను అన్యాక్రాంతం చేసేందుకే ఈ బిల్లులను తీసుకువస్తోందని అరోపిస్తూ.. ఆదివారం రోజున రాజ్యసభలో బిల్లులను అమోదిస్తున్న ఉపసభాపతి హరివంశ్ నారాయణ సింగ్ పై పుస్తకాలను, కాయితాలను విసురుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

రాజ్యసభలో ఇలాంటి వైఖరి అసలు ఆమోదయోగ్యం కాదని, ఉపసభాపతిపై దూసుకువచ్చి.. కాయితాలు విసిరి నిరసన వ్యక్తం చేసిన 8 మంది పార్లమెంటు సభ్యులను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వారిని సభ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. అయినా వారు సభ నుంచి బయటకు వెళ్లకపోవడంతో సభ ఐదు పర్యాయాలు వాయిదా పడింది. అయితే తాము దేశంలోని రైతుల సంక్షేమాన్ని గురించి నిరసన తెలుపుతున్నామే తప్ప తమ సొంత ప్రయోజనాల కోసం కాదని ఎంపీలు నినదించారు. అయినా రాజ్యసభ వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో అందుకు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని లాన్ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్దే రాత్రంతా బైఠాయించిన ఎంపీలు అక్కడే నిరసన తెలిపారు.

పార్లమెంట్ ఆవరణలోని పచ్చిక బయళ్లలోనే కూర్చుని తమ నిరసనను కొనసాగిస్తున్న వారి వద్దకు ఇవాళ రాజ్యసభ ఉపసభాపతి హరివంశ్ నారాయణ సింగ్ వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు. పార్లమెంటును ప్రభుత్వమే ఖూనీ చేసిందని.. ప్రజాస్వామ్యం పార్లమెంటులోనే అపహాస్యం అవుతుంది.. అంటూ రాసి వున్న ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న వారి వద్దకు హరివంశ వచ్చి సాదరంగా పలకరించారు. తనతో పాటు ఓ బ్యాగులో ఛాయ్ ని కూడా తీసుకువచ్చిన ఆయన నిరసన తెలుపుతున్న ఎంపీలకు ఛాయ్ అందించారు. అయితే ఆయన అందించిన టీని ఎంపీలు తిరస్కారించారు. తమకు ఛాయ్ ముఖ్యం కాదని.. దేశానికి వెన్నుముక్కలా నిలుస్తున్న రైతులకు న్యాయం చేయాలని వారన్నారు.

రాజ్యసభ ఉపసభాపతి పదవిలో వున్న మీరు ఈ బిల్లుల అమోదంతో రైతు వ్యతిరేకిగా మారారంటూ అభివర్ణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రిపురి బోరా మాట్టాడుతూ రాజ్యసభ ఉపసభాపతి తమ వద్దకు వచ్చి.. తాను ఉపసభాపతి హోదాలో రాలేదని, ఓక సహచరుడిగా, తోటి ఎంపీగా మాత్రమే ఇక్కడకు వచ్చానని తెలిపారన్నారు. అయితే ఆయన తమకు టీని ఆఫర్ చేసినా దానిని స్వీకరించేందుకు తాము నిరాకరించామని తెలిపారు. రైతుల పక్షాన నిలిస్తే తమను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తప్పుబడుతూ తాము నిరసనకు దిగామని అన్నారు. కాగా, ప్రధాని నరేంద్రమోడీ మాత్రం రాజ్యసభ ఉపసభాపతి హరివంశ్ సింగ్ సస్పెండ్ అయ్యి నిరసన చేస్తున్న సభ్యులకు టీ ఇవ్వడాన్ని ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles