ND farmers finish neighbor's harvest after heart attack కష్టకాలంలో రైతుకు అండగా నిలిచిన సహచరులు

Neighbors harvest crops for north dakota farmer who had heart attack

Humanity, America farmer, farmet heart attack, Lane Unhjem, North Dakota, Love thy neighbour, Good people, Don Anderson, Crosby, viral news, united states news

Lane Unhjem, a farmer in the United States' North Dakota, suffered a cardiac arrest when he was in middle of the harvesting process. Farmers from the nearby areas joined each other for a noble cause. 'Around 60 farmers in Divide County put their own harvesting on hold to cut 1,000 acres for a neighbor who suffered a heart attack after his combine caught fire last week,' said a report

పరిమళించిన మానవత్వం: రైతుకు అండగా నిలిచిన సహచరులు

Posted: 09/22/2020 01:29 PM IST
Neighbors harvest crops for north dakota farmer who had heart attack

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో విధాలా పథకాలు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ ఇంకా రైతు ఆకలి చావులు ఎదుర్కోంటూనే వున్నాడు. మన దేశంలోని పరిస్థితులను పక్కనబెట్టి.. అగ్రరాజ్యంలోని పరిస్థితులను పరిశీలించినా అక్కడా రమారమి రైతన్నలు సమస్యల వలయంలోనే చిక్కుకుంటున్నారు. అందుకు కారణం.. వ్యవసాయానికి పాలకులతో పాటు ప్రకృతి కూడా సాయం చేయాల్సిందే. అనువైన సమయంలో వర్షాలు.. పంట చేతికొచ్చే వేళ ఎండలు కురిస్తేనే ఆశించిన మేర దిగుబడులు లభించి రైతుల్లో ఆనందాలు నిండుతాయి. అలా కాకుండా అకాల వర్షం, నకిలీ విత్తనాలు, గాలి దుమారం వీచినా చేతికందిన పంట నష్టాలనే మిగిల్చుతుంది.

ఈ సమస్యలన్నింటినీ అధిగమించిన ఓ రైతుకు సరిగ్గా పంట కోయాల్సిన తరుణంలో గుండెపోటు వచ్చింది. దీంతో రైతుకు రైతే స్నేహితుడు.. అన్న నిజాన్ని చాటిచెప్పారు అగ్రరాజ్యంలోని రైతులు. అమెరికాలో అభివృద్ది చెందిన నగరాల్లో పబ్, గన్ కల్చర్ పెరుగిపోతున్నా.. ఇంకా అక్కడి గ్రామాల్లో మాత్రం మానవత్వం మిగిలే వుందని చాటిచెప్పారు అక్కడి రైతులు. ఓ రైతు గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలవగా, అతడికి చెందిన 1000 ఎకరాల్లో గోధుమ పంట కోతలు ఆగిపోయాయి. సకాలంలో పంట కోయకపోతే తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సాటి రైతులు చేయి చేయి కలిపి ఆ రైతుకు సంఘీభావం ప్రకటించారు. తమ సాధన సంపత్తిని ఆ రైతు పొలంలో మోహరించి కేవలం 7 గంటల్లో 1000 ఎకరాల పంట కోసి ఆ రైతు కుటుంబంలో ఆనందం నింపారు.

అమెరికాలోని నార్త్ డకోటాలో క్రాస్బీ వద్ద లేన్ ఉన్హీమ్ అనే రైతు తన వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో గోధుమ, కనోలా (ఆవజాతి గింజలు) పండిస్తున్నాడు. చేతికొచ్చిన పంట కోస్తుండగా ఓ యంత్రం కాలిపోయింది. ఈ ఒత్తిడిలో ఆయన గుండెపోటుకు గురయ్యాడు. దాంతో ఉన్హీమ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే, పంట కోత మధ్యలోనే ఆగిపోవడంతో ఉన్హీమ్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఏర్పడింది. వెయ్యి ఎకరాల పంట అంటే మామూలు విషయం కాదు. కానీ ఇరుగుపొరుగు రైతులు ఈ సమయంలో ఎంతో మానవీయ దృక్పథం ప్రదర్శించారు. సుమారు 60 మంది రైతులు తమ సాటి రైతు కోసం మద్దతుగా నిలిచారు.

తమ వద్ద ఉన్న పంటకోత యంత్రాలను ఉన్హీమ్ పొలంలో దించి 7 గంటల్లోనే పంట మొత్తం కోసి శభాష్ అనిపించుకున్నారు. ఈ రైతులు 11 కంబైన్ హార్వెస్టర్లు, ఆరు ధాన్యపు బండ్లు, 15 ట్రాక్టర్ ట్రెయిలర్లు ఉపయోగించారు.ఈ పంటను ఇప్పుడు కోయకపోతే ఉన్హీమ్ కుటుంబం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని, అందుకే తాము అతడి కుటుంబానికి సాయపడ్డామని ఇతర రైతులు తెలిపారు. ఉన్హీమ్ ఎంతో మంచి వ్యక్తి అని, తమ ప్రాంతంలో ఉన్హీమ్ కుటుంబ సభ్యులు ఎంతో సహృదయులన్న పేరు ఉందని, వారికి ఈ విధంగా తోడ్పాటు అందించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఉన్హీమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ జెన్నా బిండే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh