Mudrgada reluctant to lead Kapu agitation 'మన్నించలేకపోతున్నా.. క్షమించండీ' ముద్రగడ నోట మళ్లీ అదే మాట

Mudrgada reluctant to lead kapu agitation rejects jac leaders invitation

Mudragada Padmanabham, Kapunadu, Kapu JAC, Kapu Jac Leaders, Kapu reservation movement, open letter to kapu, mudragada letter, Andhra Pradesh, politics

Former Minister and Kapunadu leader Mudragada Padmanabham has once again rejected the invitation of the Kapu JAC Leaders to lead the Kapu reservation movement and asked them not to pressurise him.

‘‘మన్నించలేకపోతున్నా.. క్షమించండీ’’ ముద్రగడ నోట మళ్లీ అదే మాట

Posted: 09/21/2020 08:52 PM IST
Mudrgada reluctant to lead kapu agitation rejects jac leaders invitation

కాపు ఐక్యవేదిక నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న ముద్రగడ పద్మనాభం నోట మళ్లీ అదే మాట వచ్చింది. తనపై తన సామాజిక వర్గానికి చెందినవారే విమర్శలు, అరోపణలకు పాల్పడటంతో అవేదనకు గురైన ముద్రగడ.. తనను ఇవాళ కలసిన తమ సామాజిక వర్గ నేతలతో మన్నించలేక పోతున్నాను.. క్షమించండీ అన్న పదాలనే వినియోగించారు. కాపు ఉద్యమాన్ని ఉద్దృతంగా తీసుకువెళ్లి.. ప్రభుత్వాలు తమకు ప్రాధాన్యతను కల్పించేలా.. లేక రాజకీయ పార్టీలు తమ వర్గానికి సంబంధించిన అంశాలను మానిపెప్టోలో పెట్టేలా కృషి చేసిన ఆయన ఇన్నాళ్లు కాపు జేఏసీకి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభం.. తాను ఇకపై ఆ బాధ్యతలను నిర్వహించలేనని మరోమారు కరాఖండీగా తెలిపారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చిన కాపు జేఏసీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. కాపు ఉద్యమంపై వీరు అరగంటకు పైగా సమాలోచనలు జరిపారు. కాపు ఉద్యమాన్ని ఉదృతంగా ముందుకు తీసుకెళ్లగల నేతగా రాణించిన ముద్రగడను మళ్లీ బాధ్యతలు చేపట్టాలని కోరారు. అయితే వారితో చర్చలు ముగిసిన తరువాత ముద్రగడ ఓ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తాను కాపు జేఏసీ నేతల కోరికను మన్నించలేకపోతున్నాను.. క్షమించండీ అంటూ లేఖలో ప్రధానంగా పేర్కోన్నారు.

'గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేకపోతున్నందుకు క్షమించమని కోరుచున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటానండి. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియజేస్తే నా ఓపిక ఉన్నంత వరకు వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంత వరకు ఆహ్వానిస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుచున్నాను' అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. మరోవైపు, ఉద్యమానికి నాయకత్వం వహించలేనని ముద్రగడ స్పష్టం చేయడంతో... ఇకపై ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles