AP HC extends status quo on three capitals మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. అక్టోబర్ 5 నుంచి రోజువారీ విచారణ

Ap high court extends status quo on three capitals

High Court bench, Amaravati, Capital, CRDA, Chief Minister YS Jagan Mohan Reddy, YSRCP, BJP, TDP, Ministry of Home Affairs, Supreme Court

Andhra Pradesh High Court extended the status quo on two new laws for three capitals till October 5. So far, 93 petitions were filed against decentralisation of AP capital in the High Court. Day-to-day hearing was supposed to start from today (September 21) on the instructions of the Supreme Court but it was adjourned to October 5 because of the coronavirus.

మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. అక్టోబర్ 5 నుంచి రోజువారీ విచారణ

Posted: 09/21/2020 07:57 PM IST
Ap high court extends status quo on three capitals

ఆంధ్రప్రదేశ్ రాజధాని, సీఆర్డీఏ రద్దు అంశానికి సంబంధించి కేసును మరోమారు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కో కూడా పోడగించింది. మూడు రాజధానుల అంశంమై ఇప్పటివరకు దాఖలైన ఏకంగా 93 పిటీషన్లను న్యాయస్థానం వచ్చే నెల అక్టోబర్ 5కు వాయిదా వేసింది. గత నెలలో ఈ నెల 21 నుంచి రోజువారీగా విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయం తీసుకున్నా.. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేసును వచ్చే నెల 5కు వాయిదా వేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకుంది,

అక్టోబర్ 5 నుంచి రోజువారి విచారణ సందర్భంగా అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం నిర్ణయించింది. తాజా విచారణ సందర్భంగా.. విశాఖలో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని చెబుతూ, దీనిపై రాష్ట్ర సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో, తమకు వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదివరకే అటు సీఎం వైఎస్ జగన్ తో పాటు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా, రాజధాని అమరావతికి సంబంధించిన అంశాలపై ఇప్పటివరకు హైకోర్టులో 93 పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి నేతలు, మాజీ శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లు కూడా వాటిలో ఉన్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్టబద్ధత ఇత్యాది అంశాలపై ఈ పిటిషన్లు వేశారు. రాజధాని రైతులు సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘన, రాజధాని మాస్టర్ ప్లాన్ డీవియేషన్ పైనా, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైనా, రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపుపైనా రైతులు పిటిషన్లు వేయడం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles