KCR makes a powerful speech in Assembly కేంద్రం నూతన విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే నష్టాలే: కేసీఆర్

Kcr modi government taking power away from states

Telangana government, electricity department, New Central Electricity bill, Telangana CM KCR, telangana Assembly, new revenue act, revenue department in telangana, telangana latest news, telangana

TRS government is determined to give a tough time to the center as they have been in no good ties with the BJP these days and are opposing every decision too by the center. Earlier KCR vowed to oppose the new electricity bill to be introduced in the parliament sessions and he has decided not to back off at any cost.

కేంద్రం నూతన విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే నష్టాలే: కేసీఆర్

Posted: 09/16/2020 12:48 AM IST
Kcr modi government taking power away from states

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎత్తుకున్న అంశాన్నే మళ్లీ వినిపిస్తున్నారు. అయితే ఈ సారి కేంద్రం నిధుల కోసమో లేక మరో అంశాన్ని మరుగున పడేసేందుకు కాకుండా నేరుగా కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టాన్నే ఆయన టార్గెట్ చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఇదే అంశంపై ఆయన మాట్లాడారు, విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... అది చాలా ప్రమాదకరమని పేర్కోన్నారు. కేంద్రం తెచ్చే చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్ర విద్యుత్‌ చట్టం లోపభూయిష్టంగా వుందని విమర్శించారు. రాష్ట్రాలకు వున్న అధికారాలను హరించేలా నూతన చట్టం వుందని పేర్కోన్నారు. రాష్ట్రాల లోడ్‌ సెంటర్లు కూడాకేంద్ర అధీనంలోకి వెళ్తాయని వివరించారు.

నూతన విద్యుత్ చట్టం తేవొద్దని కేంద్రాన్నికోరారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చట్టంగా సీఎం కేసీఆర్ పేర్కోన్నారు, మన రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తికి ఎక్కువ అవకాశం ఉందని అయితే కొత్త చట్టంలో రెన్యుబుల్‌ విద్యుత్‌ 20శాతం ఉండాలని నిబంధన వుందని తద్వారా రాష్ట్రాలు తప్పనిసరిగా విద్యుత్‌ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేంద్ర నూతన చట్టంతో రాష్ట్రంలో 26లక్షల బోర్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కొత్త మీటర్ల కోసమే రూ.700 కోట్లు కావాలని కేసీఆర్ అన్నారు. కేంద్ర కొత్త విద్యుత్‌ బిల్లును పార్లమెంట్ లో తాము వ్యతిరేకిస్తామని తెలిపారు.

విద్యుత్‌ రంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటేనే డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కో అభివృద్ధి చెందుతాయి. నూతన చట్టం అమల్లోకి వస్తే మీటర్‌ రీడింగ్‌ ప్రకారం రాష్ట్రాల నుంచి బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తారని దీంతో రాష్ట్రాలకు విద్యుత్ స్వతంత్రం ఉండదని అన్నారు. కేంద్రం తెచ్చే కొత్త చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని పేర్కొన్నారు. దేశ ప్రజలు, రైతులపై పెనుభారం మోపే విధంగా ఉన్న విద్యుత్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లు ఉపసంహరణ తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles