Ravi Kishan's response to Jaya Bachchan's criticism బాలీవుడ్ ప్రముఖుల మధ్య అగ్గిరాజేస్తున్న డ్రగ్స్ వ్యవహారం

Expected jaya bachchan to support what i said ravi kishans response to veteran actors criticism

Jaya Bachchan, Rajya Sabha, Jaya Bachchan, Ravi Kishan, Drugs, Bollywood, samajwadi party, BJP, jaya bachchan news, Ravi kishan news, Parliament, Bhojpuri actor, sushant singh rajput, rhea chakraborty, kangana ranaut, Crime

Bhojpuri actor and BJP Member of Parliament Lok Sabha, Ravi Kishan on Tuesday slammed Samajwadi Party MP and veteran actor Jaya Bachchan on Tuesday over her 'bite the hands that feed them' comment and said he worked his way up in the film industry without anybody's support.

బాలీవుడ్ రాజకీయ ప్రముఖుల మధ్య అగ్గిరాజేస్తున్న డ్రగ్స్ వ్యవహారం

Posted: 09/15/2020 07:52 PM IST
Expected jaya bachchan to support what i said ravi kishans response to veteran actors criticism

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఇప్పటికీ ఇంకా అభిమానుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో డ్రగ్స్ వ్యవహారంతో ఈ కేసు ముడిపడిందన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాము అభిమానంగా ప్రేమించుకునే హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుని వాటికి బానిసలు అవుతారా.? అన్న ప్రశ్నలు కూడా అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఇదే అంశం అటు పార్లమెంటులోనూ ఇద్దరు సభ్యుల మధ్య వాదప్రతివాదనలకు దారి తీసింది. బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ వుందని, వాటిపై నిఘా పెట్టాలని.. లేని పక్షంలో అది పరిశ్రమను నాశనం చేస్తోందని బీజేపి ఎంపీ, నటుడు రవికిషన్ అన్నారు.

దీంతో ఆయన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఎదిగి గుర్తింపును పొందేందుకు దోహదపడిన పరిశ్రమపై తానే విమర్శలు చేయడం పట్ల ఎంపీ రవికిషన్ పై జయాబచ్చన్ తీవ్రంగా మండిపడ్డారు. చలన చిత్ర నటుడై ఉండి కూడా బాలీవుడ్‌ను విమర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. దీంతో అమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మరోమారు సమర్ధించుకున్నారు. తన వ్యాఖ్యలను జయాబచ్చన్ మద్దతు పలుకుతారని భావిస్తున్నానని చెప్పారు. తాను సినీరంగం నుంచే నటుడిగా వచ్చి గుర్తింపు సాధించుకున్నానని.. బహుబాషా చిత్రాలలో నటుడిగా రాణించానని చెప్పారు రవికిషన్.

'పరిశ్రమను పూర్తిగా తుడిచిపెట్టేసే కుట్ర జరుగుతోంది. చిత్ర పరిశ్రమకే చెందిన బాధ్యత కలిగిన నటుడిగా నేను స్పందించాను. అది నా హక్కు. అలాగే పార్లమెంటులో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించాను. నా అభిప్రాయాన్ని జయాబచ్చన్ సైతం గౌరవించాలి. నేను ఓ ప్రీస్ట్ కుమారుడిని. కష్టపడి పైకి వచ్చి 600 సినిమాలకు పనిచేశా ' అని రవి కిషన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పరిశ్రమలో అంతా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పడం లేదు. ప్రపంచంలోని అతి పెద్ద చిత్ర పరిశ్రమను సర్వనాశనం చేసేందుకు ప్లాన్ చేస్తున్న వారి గురించే నేను మాట్లాడుతున్నాను. పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని రవికిషన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaya Bachchan  Rajya Sabha  Jaya Bachchan  Ravi Kishan  Drugs  Bollywood  samajwadi party  BJP  Crime  

Other Articles