Heavy rains alert for Andhra pradesh districts అలర్ట్: పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు : ఐఎండి

Imd forecasts very heavy rains for next four days in parts of andhra pradesh

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

IMD has forecasted heavy to very heavy rains in different parts of Andhra Prades for the next four days.

అరేబియా సముద్రంలో ఆవర్తనం.. నాలుగు రోజులు భారీ వర్షాలు : ఐఎండి

Posted: 09/11/2020 07:23 PM IST
Imd forecasts very heavy rains for next four days in parts of andhra pradesh

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి, చిన్న వాగులు వంకలు కూడా ప్రవహిస్తూన్నాయి. కుంటలు, చెరువులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇక వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఈ తరుణంలో భారతీయ వాతావరణ శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. గత నెలలో ఏకంగా పది నుంచి పన్నెండు రోజుల పాటు వరుసగా కురిసిన వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం అంటే పలు ప్రాంతాల్లో సంబరం కన్నా బాధే కనబడుతోంది. వరదలు, గండ్లతో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనబడుతోంది.

ఈ తరుణంలో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనలతో వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కర్ణాటక వద్ద అరేబియా సముద్రంలో 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు వున్నాయని, మరీ ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయని తెలిపింది, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, తూర్పు, పడమర గాలుల వల్ల రాష్ట్రంలో నిన్న ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రత మూడు డిగ్రీల వరకు పెరగ్గా, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles

Today on Telugu Wishesh