Pawan Kalyan on hunger strike over temple attacks అంతర్వేది ఘటనకు నిరసనగా పవన్ కల్యాణ్ ‘‘ధర్మ పరిరక్షణ దీక్ష’’

Pawan kalyan bjp leaders on hunger strike over temple attacks in andhra

Pawan Kalyan, Jana Sena, BJP, AP CM, YS Jagan Mohan Reddy, temples, hunger strike, Antarvedi, Charriot, Somu Veerraju, Andhra Pradesh, Politics

Thousands of leaders and activists of Bharatiya Janata Party and Jana Sena sat on an 11-hour long hunger strike all over Andhra Pradesh in protest against alleged attacks on Hindu temples and the burning of a temple chariot.

అంతర్వేది ఘటనకు నిరసనగా పవన్ కల్యాణ్ ‘‘ధర్మ పరిరక్షణ దీక్ష’’

Posted: 09/10/2020 03:58 PM IST
Pawan kalyan bjp leaders on hunger strike over temple attacks in andhra

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 'ధర్మ పరిరక్షణ దీక్ష'కు దిగారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా పవన్ కల్యాణ్ ఈ దీక్షకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం‌ అగ్నికి ఆహుతైన నేపథ్యంలో బీజేపి సహా జనసేన వర్గాలు ఇవాళ ధర్మ పరిరక్షణ దీక్షకు పూనుకున్నాయి, అంతర్వేది ఘ‌ట‌న‌తో పాటు హిందూ దేవాల‌యాల విష‌యంలో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలను నిర‌సిస్తూ ధర్మ పరిరక్షణ దీక్ష‌ దిగిన‌ట్లు జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల ధర్మ పరిరక్షణ దీక్షను ప్రారంభించారు.

ఏకంగా 11 గంటల పాటు సాగిన నిరాహారంగా సాగనున్న ఈ దీక్ష రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది, జనసేన-బీజేపీ సంయుక్తంగా పిలుపునివ్వ‌డంతో ఇందులో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లోని త‌న కార్యాల‌యం వ‌ద్ద ఈ దీక్ష చేస్తుండగా, బీజేపి అంద్రప్రదేశ్ రాష్ట్ర అథ్యక్షుడు సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దీక్షకు దిగారు. బీజేపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా గుంటూరులో దీక్షకు దిగారు. ఇక పలు జిల్లాల్లో బీజేపి, జనసేన నేతలు దీక్షలకు దిగారు. 'దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి వ్యతిరేకంగా ఈ దీక్షకు పిలుపునిచ్చాయి.

ఈ సందర్భంగా జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలను ప్రభుత్వాలు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ ఆస్తుల‌ను పరిరక్షించాల్సిన అవసరం కూడా వుందని అన్నారు. రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం హిందూవులపై దాడులు జరుగుతున్నాయని, హిందువుల ఆలయాలపై కూడా నిర్లిప్త వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. కాగా పవన్ కల్యాణ్ తన జనసేన కార్యాలయం ఆవ‌ర‌ణ‌లో కుర్చీలో కూర్చొని పుస్త‌కం చ‌దువుతూ ఆయ‌న ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలు చేయాల‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు  దీక్ష చేప‌డుతున్నారు. బీజేపీ నేత‌లు, కార్యకర్తలు కూడా తమ ఇళ్ల వద్ద దీక్షలు చేపట్టారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles