AstraZeneca-Oxford trials not paused in India ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు యథాతథం

Oxford coronavirus vaccine last stage trial paused over adverse side effects

COVID-19, coronavirus, corona positive, COVID-19 vaccine, coronavirus vaccine,vaccine latest updates,corona vaccine latest,covid vaccines news,latest coronavirus vaccine,oxford covid vaccine,astrazeneca oxford vaccine latest news

Pune-based Serum Institute of India (SII) on September 9 said the trials of the AstraZeneca-Oxford COVID-19 vaccine have not been paused in India, adding that the vaccine candidate's trials in the United Kingdom had been put on hold.

భారత్ లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు యథాతథంగా కొనసాగింపు

Posted: 09/09/2020 11:12 PM IST
Oxford coronavirus vaccine last stage trial paused over adverse side effects

(Image source from: Timesofindia.indiatimes.com)

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి.. ప్రజాజీవనాన్ని స్థంభింపజేసి అప్పుడే ఏకంగా తొమ్మిది మాసాలు కావస్తున్నా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికను సొంతం చేసుకున్న ఏ ఒక్క వ్యాక్సిన్‌ కూడా ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే దక్షిణాఫ్రికా తమ ప్రాంత ప్రజలకు అవసరమైన వాక్సీన్ ను తాము రూపోందించామని ప్రకటించగా, రష్యా కూడా తమ వాక్సీన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. వారి ప్రయోగాలు కూడా ఆశాజనకంగా వున్నాయని ఇప్పటికే రష్యా అరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యరంగంలో అగ్రగామి దేశాలు మాత్రం ఇంకా పరిశోధన ఫలితాల దశలోనే వున్నాయి.

ముందుగా తాము వాక్సీన్ ను రూపోందించామని ప్రకటించిన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తమ అస్ట్రాజెనెకా మూడో దశ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసింది. బ్రిటన్ లో ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తిన కారణంగా ఈ మేరకు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీంతో తొలి రెండు దశలు పూర్తి చేసుకున్న వాక్సీన్ కీలకమైన మూడవ.. తుది దశకు చేరుకున్న తరుణంలో క్లినికల్‌ ట్రయల్స్ ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. వ్యాక్సిన్‌ తయారీ, భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

అయితే భారత్ లో మాత్రం ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ప్రయోగాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా యధాతథంగా కొనసాగుతున్నాయని ఫూణే కేంద్రంగా హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సెరమ్ ఇండియా ప్రకటించింది. యూనైటెడ్ కింగ్ డమ్ లో మాత్రమే ఈ ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని చెప్పిన సంస్థ.. అక్కడ వారు ఎందుకు తాత్కాలికంగా నిలిపివేశారన్న వివరాలపై తాము వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. అయితే వారు త్వరలోనే తిరిగి ప్రయోగాలను చేపట్టవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్ ప్రయోగాలు ఎంతో ఆశాజనకంగా సాగుతున్నాయని.. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AstraZeneca  coronavirus  India  Serum Institute  covid vaccine  Oxford University  covid-19  

Other Articles