5 people landed in the well to save the calf, all died ఆవుదూడను రక్షించబోయి నీటమునిగిన ఐదుగురు..

5 people landed in the well to save the calf all died the calf survived

poisonous gas, Gonda well tragedy, Gonda news, Gonda family death, Gonda deaths, Uttar Pradesh, Crime

Five people landed in a well under Maharajganj police station area in Gonda district of Uttar Pradesh died of poisonous gas. He landed in the well to save a calf. The three deceased were from the same family, all three descended into the well to save the baby (calf) of the cow.

ఆవుదూడ సేఫ్.. రక్షించబోయి నీటమునిగిన ఐదుగురు..

Posted: 09/09/2020 10:57 PM IST
5 people landed in the well to save the calf all died the calf survived

(Image source from: India.com)

ఆపదలో వున్నవారిని రక్షించడం కోసం ఐదుగురు వ్యక్తులు పూనుకున్నారు. అయితే ఆపదలో వున్నది ఎవ్వరు అన్నది కూడా ముఖ్యం. ఇక్కడ ఆపదలో కూరుకుపోయింది ఆ దూడ. అదీనూ హిందువుల పరమ పవిత్రమైన ఆవు దూడ. దీంతో దానిని రక్షించేందుకు ఐదుగురు పూనుకున్నారు. అయితే కాపాడేందుకు పూనుకున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆవు దూడ మాత్రం సురక్షితంగా బబయటపడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది. గొండాలోని రాజా మొహల్లాలో ఈ ఘటనతో విషాదాన్ని నింపింది.

ఎందుకంటే మరణించిన ఐదుగురు వ్యక్తులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో రాజా మొహల్లాలో విషాదవాతావారణం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా వున్న పురాతనమైన పాడు బడిన బావిలో పడిపోయిన ఆవుదూడను రక్షించబోయి ఐదుగురు దానిని రక్షించేందుకు అందులోకి దిగారు, బావి పాడుబడడంతో స్థానికులు అం దులో చెత్త వేయడంతో అది దుర్గంధమయంగా మారింది. అయితే ఆవుదూడ కాపాడటమే తమ ముందు కనిపించిన లక్ష్యంగా భావించిన ఐదుగురు వరుసగా ఒకరి తరువాత ఒకరు అందులోకి దిగారు.

ముందుగా గమనించిన ఓ వ్యక్తి.. ఆవుదూడను రక్షించేందుకు నిచ్చెన సాయంతో బావిలోకి దిగాడు. చెత్తాచెదారం నీళ్లలో వుండటంతో అవి కాస్తా విషవాయువులను వెదజల్లుతున్నాయి. బావిలోకి దిగడంతోనే దానిని పీల్చి మూర్ఛపోయాడు. దీంతో ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు మరో నలుగురు వ్యక్తులు కూడా బావిలోకి దిగారు. ముందుగా దిగిన వ్యక్తిని రక్షించబోయిన వారు ఆ ప్రయత్నంలో మూర్ఛపోయారు. అగ్నిమాపక దళం, మునిసిపాలిటీ సిబ్బంది వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ ఐదుగురు చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : poisonous gas  Gonda well tragedy  Gonda news  Gonda family death  Gonda deaths  Uttar Pradesh  Crime  

Other Articles