Telangana Govt scraps VRO system in state తెలంగాణ రెవెన్యూలో కీలక మార్పు.. వీఆర్వో వ్యవస్థ రద్దు..

Telangana government sensational decision scraps vro system in state

Telangana government, VRO, Village Revenue Officer system, revenue department, Chief Secretary Somesh Kumar, Telangana CM KCR, telangana news, vro department in telangana, telangana latest news, telangana

Telangana government has decided to scrap the Village Revenue Officer (VRO) system in the state. The Chief Secretary Somesh Kumar all the district collectors to collect all the records with respect to the department by 3 pm and submit them to the government by 5 pm.

తెలంగాణ రెవెన్యూలో కీలక మార్పు.. వీఆర్వో వ్యవస్థ రద్దు..

Posted: 09/07/2020 05:12 PM IST
Telangana government sensational decision scraps vro system in state

తెలంగాణ రెవన్యూ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రెవెన్యూ ఉధ్యోగుల వినతితో వెనక్కు తగ్గినా.. తాజాగా రెవెన్యూ శాఖ విపరీతమై అవినీతికి ఆజ్యం పోస్లూ నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగివున్న విలేజ్ రెవెన్యూ అధికార (వీఆర్‌వో) వ్యవస్థ రద్దు చేస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు వచ్చాయి, అధికారికంగా ఈ వ్యవస్థలో వీఆర్వోలుగా విదులు నిర్వహిస్తున్న వారి నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా జిల్లా కలెక్టర్లకు అదేశాలను జారీ చేయడంతో.. ఈ వ్యవస్థ రద్దు కాబోతున్నాయన్న కథనాలకు బలం చేకూరింది.

ఈ మేరకు తెలంగాణ‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ సంబంధిత‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వీఆర్వోల నుంచి  రాష్ట్రంలోని వీఆర్‌వోల వద్దనున్న రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లను అదేశించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ ప్ర‌క్రియ పూర్తి కావాల‌ని ఆయ‌న చెప్పారు. అలాగే, సాయత్రం 5 గంటలలోపు.. రికార్డుల స్వాధీనంపై నివేదికలు ఇవ్వాలని తెలిపారు.  రెవెన్యూ శాఖలో అవినీతి భారీగా పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. ఏసీబీ  దాడుల్లో చిక్కుతున్న వారిలో వీఆర్వోలే అధికంగా ఉంటున్నారు. దీంతో ఆ వ్య‌వ‌స్థ‌కు స్వ‌స్తి చెప్పాల‌ని కేసీఆర్ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు.

కొత్త రెవెన్యూ చ‍ట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే  ప్రకటించారు. నేటి నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల‌ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. కొత్తచట్టాన్ని ఈ స‌మావేశాల్లోనే ప్రకటిస్తారని స‌మాచారం. వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేయ‌నున్నారు. కాగా, దివంగత సీఎం ఎన్టీఆర్‌ హయాంలోనూ పటేల్‌, పట్వారీల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే వెళ్తూ కేసీఆర్‌ కూడా పలు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని నెల‌ల క్రిత‌మే గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు.

ఈ మేర‌కు సోమేశ్ కుమార్ అన్ని చ‌ర్య‌లూ తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా కొన్ని వారాల క్రిత‌మే  తెలిపారు. రైతులు భూములు సాగు చేసుకుంటున్నా వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కడం లేదని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు రాక, ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు పొందలేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దీనికి వీఆర్‌వోలే కారణమని, ఆ వ్యవస్థను రద్దు చేస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Revenue department  VROs  village revenue officers  somesh kumar  Chief secretary  Telangana  

Other Articles