AP government issues unlock 4.0 guidelines ఏపీ సర్కార్ అన్ లాక్ 4.0 గైడ్ లెన్స్: ఆంక్షలతో విద్యార్థులకు అనుమతి

Ap govt issues unlock 4 0 guidelines allows students to attend schools from september 21st

AP government, unlock 4.0 guidelines, schools, skill development centers, inter collages, PG collages, PHD collages, CM YS Jagan Mohan Reddy, Central Government, Private Busses, Students, schools in andhra pradesh ,andhra pradesh news

Andhra Pradesh government headed by chief minister YS Jagan Mohan Reddy on Monday has released Unlock 4.0 guidelines in line with central government regulations. In the guidelines, the government has issued permission to run the schools for classes 9, 10 and Intermediate from 21st and orders were issued allowing inter students to go to schools.

ఏపీ సర్కార్ అన్ లాక్ 4.0 గైడ్ లెన్స్: ఆంక్షలతో విద్యార్థులకు అనుమతి

Posted: 09/07/2020 06:22 PM IST
Ap govt issues unlock 4 0 guidelines allows students to attend schools from september 21st

(Image source from: Mirchi9.com)

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీలో విజయవాడ కు ప్రైవేటు బస్సుల రాకపోకలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. పన్నులు చెల్లించి క్లియరెన్స్‌ తీసుకోవాలని ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై తెలంగాణ ప్రభుత్వంతో వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక అన్ లాక్ 4.0 అన్ లాక్ లో భాగంగా ఈ నెల 21 నుండి 9, 10వ తరగతి విద్యాలయాలకు, ఇంటర్ కాలేజీ విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇలా కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో తప్పని సరి చేసింది, ఈ నెల 21 నుంచి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లకు కూడా అనుమతి ఇచ్చింది. పీహెచ్ డీ, పీజీ విద్యార్థులు కూడా తరగతులకు హాజరయ్యేందుకు అభ్యంతరాలను తొలగించింది. ఈ నెల 21 నుంచి 100 మంది మించకుండా సమావేశాలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

ఇక అంతకు ఒక్క రోజు ముందు నుంచే రాష్ట్రంలో వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కేంద్రం మాత్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలలో వంద మందికి అనుమతిని ఇచ్చింది. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభన కోనసాగుతున్న క్రమంలో ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తాజా గైడ్ లైన్స్ విడుదల చేసింది, ఇక 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా థియేటర్లు, ఈత కొలను, వినోదాత్మకాన్ని పంచే ఎమ్యూజ్ మెంట్ పార్కులకు అనుమతి నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles