Hyderabad Metro to resume operations from Sep 7 మళ్లీ కూతకు సై అంటున్న హైదరాబాద్ మెట్రో..!

Hyderabad metro to resume operations from september 7

Hyderabad Metro resumes, Hyderabad metro latest, unlock 4, unlock 4 guidelines, telangana unlock 4 rules, hyderabad unlock 4 latest news, lockdown news, lockdown unlock 4, hyderabad metro, metro train, NVS Reddy, MHA Guidelines, Sanitisation, coronavirus, Unlock 4.0, Hyderabad metro latest

Five months after its services were suspended due to the COVID-19 pandemic-induced-lockdown, Hyderabad Metro will resume its operations from September 7.

మళ్లీ కూతకు సై అంటున్న హైదరాబాద్ మెట్రో..!

Posted: 09/02/2020 11:32 PM IST
Hyderabad metro to resume operations from september 7

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు మళ్లీ పునరుద్దరించనున్నారు. ఈ మేరకు కేంద్ర అన్ లాక్ 4.0 తో అనుమతులు లభ్యం కావడంతో ఈ నెల 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ఆరు మాసాల తరువాత కూతకు సన్నధం అవుతోంది. మెట్రో రైళ్లను నడపడానికి ఇప్పటికే కేంద్రం అనుమతించగా, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది.

ఇక అన్ లాక్ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌, దూరవిద్యా తరగతులు నిర్వహణకు అనుమతినిచ్చిన కేంద్రం.. వీటిని ప్రోత్సహించాలని సూచించింది. కాగా, పాఠశాలలు, కళాశాలలు, విద్యా శిక్షణ సంస్థలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్, వినోద పార్కులు, థియేటర్లపై నిషేధం కొనసాగుతుందన్న కేంద్ర ప్రభుత్వం.. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు నడుస్తాయని వెల్లడించింది. కాగా, బార్లు, క్లబ్‌లు మూసి ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం తాజాగా అదేశాలను జారీ చేసింది. ఇక మెట్రో రైలు సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.

*    కంటైన్మెంట్ జోన్లలో ఉండే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు.

*    థర్మల్ స్క్రీనింగ్ తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే స్టేషన్ లోపలకు అనుమతిస్తారు.

*    సామాజికదూరాన్ని పాటించే నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైళ్లు కొన్ని స్టేషన్లలో ఆగకుండానే వెళ్లిపోతాయి.

*    అతి తక్కువ లగేజీని మాత్రమే అనుమతిస్తారు. మెటల్ ఐటెమ్స్ ని అనుమతించరు.

*    సామాజికదూరాన్ని పాటించే క్రమంలో స్టేషన్లతో పాటు, రైలు బోగీల్లో కూడా మార్కింగ్ వేస్తారు.

*    ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా మాస్కులు కచ్చితంగా ధరించాలి. మెట్రో స్టేషన్లలో మాస్కుల విక్రయాలు జరపాలి.  

*    ఆరోగ్యసేతు యాప్ ను వినియోగిస్తే మంచిది.

*    స్టేషన్ ఎంట్రన్స్ లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి.

*    తరచుగా స్టేషన్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.

*    స్మార్ట్ కార్డ్, ఆన్ లైన్ చెల్లింపులకు ప్రాధాన్యతను ఇవ్వాలి.

*    టోకెన్లు, టికెట్లను కూడా సరైన రీతిలో శానిటైజ్ చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles