Janasena Leaders Donated Oxygen Cylinders పవన్ కల్యాణ్ జన్మదినాన.. అక్సిజన్ సిలిండర్ల పంఫిణీ

Janasena leaders donated oxygen cylinders to covid hospital

Pawan Kalyan, Birthday, Janasena, JSP GHMC President, Radharam RajaLingam, oxygen cylinders, GHMC janasena, janasena ghmc, oxygen, Janasena GHMC President Radharam RajaLingam, Janasena GHMC President, Radharam RajaLingam, telangana, politics

Janasena Leaders belonging to Greater Hyderabad Municipal Corporation distributes oxygen cylinders on the occassion of Janasena President and Actor PowerStar Pawan Kalyan Birthday Celebrations. On this Occassion Janasena GHMC President Radharam RajaLingam Condolences to the Jansainiks who were electrocuted.

జనసైనికుల ఉదారత: పవన్ కల్యాణ్ జన్మదినాన.. అక్సిజన్ సిలిండర్ల పంఫిణీ

Posted: 09/02/2020 11:02 PM IST
Janasena leaders donated oxygen cylinders to covid hospital

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ.. బాధితులకు ఆక్సిజన్ సిలిండర్ల అవసరం కూడా పెరుగుతోంది. ఈ వాస్తవాన్ని గ్రహించని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి పంఫిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగుజాడల్లోనే తాము సమాజ సేవకు పాటుపడుతున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి గ్రేటర్ జనసేన నేతలు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భాన్ని పురస్కారించుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ కోవిడ్-19 జడలు విప్పిన ఈ సందర్భంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ గొప్ప కార్యక్రమని కొనియాడారు. అయితే ప్రస్తుత పరిస్థితిలతో పాటు కోవిడ్ తదనంతర పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లు ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. ఆస్తమా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు తరుచూ ఉపయోగపడతాయని తెలిపారు. దీర్ఘకాలం ఉపయోగపడే కార్యాక్రమం చేస్తోన్న గ్రేటర్ జనసేన నాయకులను ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు. చెస్ట్ ఆస్పత్రి తరుపున జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

సినీనటుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన జనసేనాని పవన్ కల్యాణ్.. అప్పటినుంచే సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించేవారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము తమకు తోచిన విధంగా సమాజ సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని గ్రేటర్ జనసేన అధ్యక్షుడు రాజలింగం తెలిపారు. పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే చెస్ట్ ఆస్పత్రికి 35 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో వివిధ ప్రభుత్వాస్పత్రులకు మొత్తం 100 ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో హడావుడి లేకుండా జనసేన తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles