Prashant Bhushan: India lawyer fined one rupee for tweets ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు

Indian court hands down symbolic sentence for outspoken lawyer

Prashant Bhushan, Contempt case against Prashant Bhushan, Prashant Bhushan Case, Supreme Court, prashant bhushan case news, supreme court news, supreme court on prashant bhushan case, rajiv dhawan, CJI, SA Bobde

Senior lawyer Prashant Bhushan said that he 'gracefully' accepted the Supreme Court verdict in the contempt case and added that the Re 1 fine levied on him has been paid. Bhushan was found guilty of criminal contempt of court on August 14 over his tweets against the Supreme Court and Chief Justice of India SA Bobde.

ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు..

Posted: 08/31/2020 04:25 PM IST
Indian court hands down symbolic sentence for outspoken lawyer

(Image source from: Twitter.com/pbhushan1)

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడే విధంగా వివాదాస్పద ట్వీట్ లు చేసిన నేపథ్యంలో ఆయనపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మాజీ ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ప్రస్తుత సీజే జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై సుప్రీంకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసి, ఆయనను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిక్ష విధింపుపై కూడా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆయనకు ఈ రోజు ఒక్క రూపాయిని జరిమానాగా కట్టాలని శిక్షను విధించింది.

ఆయనకు కోర్టు ఒక్క రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆయనను ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోపు రూ.1 జరిమానా కట్టడంలో విఫలమైతే కనుక, మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేయకుండా నిషేధం విధిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడంపై ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు. దీంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఈ కేసును స్వీకరించి విచారించింది.

కొన్ని రోజుల క్రితం సీజే బోబ్డే ఖరీదైన బైక్‌ పై హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారని ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో. కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడి త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింది. తనకు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుని అభిప్రాయాలను వ్యక్తం చేశానని ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prashant bhushan  supreme court  rajiv dhawan  CJI  SA Bobde  Contempt case  

Other Articles