Filmmaker Nutan Naidu tonsured dalit's head దళిత యువకుడికి గుండు గీయించిన నూతన్ నాయుడు.?

Bigboss contestant and filmmaker nutan naidu tonsured dalit housemaids head

Nutan Naidu, Dalit death, Karri Srikant, housemaid, bigboss telugu, big boss show, maid srikanth, nutan naidu dalit maid, nutan naidu dalit maid tonsure, nutan naidu maid srikanth tonsure, nutan naidu big boss telugu contestant, big boss-2 telugu, Visakhapatnam, Visakhapatnam Latest News, Andhra Pradesh, crime

In a wierd incident, bigboss-2 telugu contestant and filmmaker Nutan Naidu tonsured a Dalit youth's head at the former's residence. Karri Srikanth, a 20-year old, SC, working at Nutan Naidu's house, had quit his job on August 1. Unable to accept his leaving the job, Nutan Naidu workers tonsured Srikanth's head by force.

ITEMVIDEOS: దళిత యువకుడికి గుండు గీయించిన నూతన్ నాయుడు.?

Posted: 08/29/2020 01:45 AM IST
Bigboss contestant and filmmaker nutan naidu tonsured dalit housemaids head

సినీ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 2 కంటెస్టెంట్‌ నూతన నాయుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్-2 షోలో గాయాలపాలై షో నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చినా మళ్లీ గాయంతో వైదొలగిన నూతన్ నాయుడు అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోమారు ఆయన దారుణమైన అరోపణలు ఎదుర్కోంటూ వార్తల్లో వ్యక్తిగా మారారు. నూతన్ నాయుడు తన వద్ద పనిచేసిన దళిత యువకుడిపై తన మనుషులతో బలవంతంగా శిరోముండనం(గుండు గీయించడం) చేయించారని ఆరోపణలు సంచలనం సృష్టించాయి.

దళితుడన్న కనికరం కూడా లేకుండా తనపై దారుణానికి ఒడిగట్టాడని బాధితుడు అరోపిస్తున్నాడు. తాను పనిచేసే ఇంటి యాజమాని అయిన నూతన నాయుడు.. తన మనషుల చేత బలవంతంగా తనకు గుండు గీయించాడని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులకు ఆయన పిర్యాదు చేశారు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్లో నూతన నాయుడు నివాసముంటున్నారు. నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. కాగా కరోనా వేళ.. తన తల్లిదండ్రుల చెంతకు వెళ్తానని చెప్పి ఆగస్టు ఒకటో తేదీ వచ్చేశాడు.

అయితే తల్లిదండ్రుల ఒత్తడి మేరకు కరోనా కష్టకాలం నేపథ్యంలో మళ్లీ పనికి వెళ్లకుండా ఇంటిపట్టునే వుంటున్నాడు. దీంతో తనకు చెప్పకుండా పనిమానేయడంతో నూతన నాయుడుకు కోపం వచ్చిందని. దీంతో తనపై సెల్ ఫోన్ పోయిందన్న దొంగతనం ఆరోపణలు మోపాడని శ్రీకాంత్‌ తెలిపాడని పోలీసులు చెప్పారు. నూతన్ నాయుడు నుంచి ఇలా ఫోన్ రావడంతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు వెళ్లిన శ్రీకాంతన్ ను తన మనుషులతో బంధించి గుండు గీయించినట్లుగా బాధితుడు అరోపిస్తున్నాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతన నాయుడు బెదిరించినట్లు శ్రీకాంత్ తెలిపారు.  శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు సంఘటనపై పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nutan Naidu  Dalit death  Karri Srikant  housemaid  maid srikanth  Visakhapatnam  Andhra Pradesh  crime  

Other Articles