Africa declared free of wild polio in 'milestone' పోలియోపై పోరులో ఆఫ్రికా విజయం: ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి..

Africa now free of wild poliovirus but polio threat remains

threat, remains, polio, poliovirus, free, wild, africa, World Health Organization, african continent, pakistan, afganistan, wild polio

Health authorities declared the African continent free of the wild poliovirus after decades of effort, though cases of vaccine-derived polio are still sparking outbreaks of the paralyzing disease in more than a dozen countries.

పోలియోపై పోరులో ఆఫ్రికా విజయం: ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి..

Posted: 08/26/2020 03:43 PM IST
Africa now free of wild poliovirus but polio threat remains

ఆఫ్రికా ఖండం మరో ఘనతను సొంతం చేసుకుంది. నాలుగు దశాబద్దాలకు పూర్వం మశూచి (పెద్ద అమ్మవారు) అంటువ్యాది తమ ఖండం నుంచి విజయవంతంగా తరమిన ఆఫ్రికా.. మళ్లీ ఇన్నాళ్లకు మరో మహమ్మారిపై యుద్దం చేసి విజయం సాధించి రికార్డులకెక్కింది. వైల్డ్ పోలియో వ్యాధిని జయించిన ఖండంగా అవతరించింది, ఈ మేరకు ఆరోగ్యశాఖ యంత్రాంగం వెలువరించిన ఓ ప్రకటనలో ఆప్రికా ఖండం ఇక పోలియో రహిత ఖండంగా అవతరించిందని ప్రకటించింది. దశాబ్దాల పాటు ఆఫ్రికా ఖండం చేసిన పోరాటం ఎట్టకేలకు విజయం సాధించిందని,, ఇది ఎంతో గర్వకారణమని ప్రకటనలో పేర్కోంది.

గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ ఖండంలో నమోదు కాకపోవడంతో ఆఫ్రికాను పోలియో రహిత ఖండంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆఫ్రికా దేశమైన ఈశాన్య నైజీరియాలో చివరిసారి నాలుగేళ్ల క్రితం ఒకే ఒక్క పోలియో కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు దాని ఉనికి లేదు. పోలియోను తరిమికొట్టడంలో ప్రభుత్వం, దాతలు, ఆరోగ్యకార్యకర్తలు, కమ్యూనిటీలు చేసిన కృషి ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. వారి కృషి ఫలితంగా 1.8 మిలియన్ మంది చిన్నారులు పోలియో నుంచి బయటపడ్డారని కొనియాడింది. పోలియో నిర్మూలన కోసం గత 30 ఏళ్లుగా కృషి చేస్తున్నామని నైజీరియా వైద్యుడు, రోటరీ ఇంటర్నేషనల్ స్థానిక యాంటీ పోలియో కోఆర్డినేటర్ తుంజీ ఫన్‌షో అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలనలో ఇది ఎంతో కీలకమైన దశ అని, తమ ఖండం నుంచి పోలియోను తరిమికొట్టినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆఫ్రికా ఖండం పోలియో రహితంగా మారినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కలిసి అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇప్పటికీ పాకిస్థాన్, అప్ఘనిస్తాన్ దేశాల్లో మాత్రం ఇంకా పోలియో మహమ్మరి తిష్ట వేసింది. అక్కడ కూడా పోలియోను నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యలకు అక్కడి ప్రజలే అవరోధాలుగా నిలుస్తుండటమే కారణం. ఆరోగ్యకార్యకర్తలకు భద్రత కరువై.. వారిపై దాడులు కూడా జరగడంతో వారు వెనక్కి తగ్గడంతో కలుషిత నీటి నుంచి వ్యాపించే ఈ మహమ్మారి ఈ రెండు దేశాల్లో ఇంకా కోనసాగడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : threat  remains  polio  poliovirus  free  wild  africa  World Health Organization  african continent  pakistan  afganistan  wild polio  

Other Articles