Srisailam dam gates opened and water released శ్రీశైలానికి జలకళ.. మూడు గేట్టు ఎత్తివేసిన అధికారులు

Officials opened three gates to released water from srisailam dam

srisailam dam, srisailam temple, srisailam project, srisailam reservoir, srisailam dam gates lift, srisailam gates open, hyderabad to srisailam, srisailam rtc buses, telangana tourism, special attraction of Srisailam dam, kurnool, Andhra pradesh

Now there is a special attraction at the Srisailam dam for all the passers by to watch, as Officials of the Dam opened three gates and released the water down to Nagarjuna sagar dam.

శ్రీశైలానికి జలకళ.. మూడు గేట్టు ఎత్తివేసిన అధికారులు

Posted: 08/19/2020 10:05 PM IST
Officials opened three gates to released water from srisailam dam

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యామ్‌ నిండు కుండలా మారింది. పూర్తి స్థాయిలో జలాశయం నిండడంతో గేట్లుఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం మూడు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ డ్యామ్‌కు నీటిని వదిలారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 3.67 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 66,954 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు వరద నీరు చేరింది. పై నుంచి ఇంకా వరద వస్తుండడంతో గేట్లు తెరిచారు అధికారులు. మూడు గేట్లు ఎత్తడంతో శ్రీశైలంలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆ అద్భుత జలదృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

సాధారణంగా శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారంటే పర్యాటకుల్లో ఎక్కడ లేని ఆనందం కనిపిస్తుంది. గేట్లు తెరచుకున్న మరుసటి రోజే పెద్ద ఎత్తున శ్రీశైలానికి క్యూకడుతుంటారు. పిల్లలతో కలిసి కుటుంబమంతా షికారుకు వెళ్తుంటారు. నల్లమలలోని ఘాట్ రోడ్లలో పెద్ద మొత్తంలో వాహనాలు క్యూ కడుతుంటాయి. కానీ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్‌కు పర్యాటకులను అనుమతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles