Dr Reddy's launches Avigan tablets in India for Covid-19 కరోనా వైరస్ చికిత్సకు డాక్టర్ రెడ్డీస్ నుంచి మందు

Dr reddys launches antiviral drug avigan in india to launch remdesivir in september

Dr Reddy, covid-19, favipiravir, branded markets, The Drugs Controller General of India, coronavirus, drug Avigan, Fujifilm Toyama Chemical Co

Generic drugmaker Dr Reddy's Laboratories launched antiviral drug Avigan (favipiravir) tablets, currently being manufactured by innovator Japanese drug giant Fujifilm Toyama Chemical Co, for the potential treatment of mild to moderate Covid-19 patients in India, which accounts for nearly a third of the world’s Covid-19 cases.

కరోనా వైరస్ చికిత్సకు డాక్టర్ రెడ్డీస్ నుంచి మందు

Posted: 08/19/2020 09:37 PM IST
Dr reddys launches antiviral drug avigan in india to launch remdesivir in september

కరోనా వైరస్ మహమ్మారి నుంచి రోగులను బయట పడేయడానికి అందుబాటులోకి వచ్చిన రెమిడిసీవిర్ మందుతో పాటు ఫావిపిరావిర్ మందు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఈ మందును పలు దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. కాగా వాటితో పాటు పోటీపడి తమ మందును కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్. ఈ మేరకు ఇవాళ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

అంతేకాదు తమ మందును బ్లాక్ మార్కెట్ తరలివెళ్లకుండా నేరుగా రోగుల ఇంటికే ఔషధాన్ని హోమ్ డెలివరీ చేస్తామని ఈ సందర్భంగా మరో శుభవార్తను కూడా సంస్థ అందించింది. కరోనా బాధితులకు వేగంగా ఈ  ఔషధాన్ని అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 42 నగరాల్లో ఉచిత హోమ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. జపనీస్‌ దిగ్గజం ఫుజిఫిల్మ్‌ టొయామా కెమికల్‌ కంపెనీతో గ్లోబల్‌ లైసెన్స్‌ ఒప్పందంలో భాగంగా వీటిని తీసుకొచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. అవిగాన్ రెండు సంవత్సరాల షెల్ఫ్ లైఫ్ తో 122 టాబ్లెట్ల పూర్తి థెరపీ ప్యాక్‌లో వస్తుందన్నారు.

అలాగే వారమంతా (సోమవారం-శనివారం వరకు) ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేలా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతానికి వారు జపాన్ నుండి దీనిని దిగుమతి చేసుకుంటున్నారని, త్వరలో దేశీయంగా తయారు చేస్తామని రమణ తెలిపారు. అలాగే కరోనాకు సంబంధించి మరో ఔషధమైన రెమ్‌డెసివిర్‌ను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు అవిగాన్ (ఫావిపిరవిర్) ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles