India begins Phase 3 human trials of COVID19 vaccine కరోనా వాక్సీన్: మూడో దశ పరీక్షలకు ముహూర్తం ఖరారు

Coronavirus vaccine update india begins phase 3 human trials of covid19 vaccine

Coronavirus vaccine, Coronavirus vaccine update, Coronavirus vaccine in India, Coronavirus vaccine status, Coronavirus vaccine trials, Coronavirus vaccine trials in India, Coronavirus vaccine update India, COVID19 vaccine, COVID19 vaccine news, COVID19 vaccine India, COVID19 vaccine update, COVID19 vaccine progress, COVID19 vaccine name

Coronavirus vaccine phase 3 human trials are beginning in India, NITI Aayog announced. The central government has requested manufacturers to indicate potential prices of coronavirus vaccines, NITI Aayog member V.K. Paul said. India has two indigenous vaccines which are undergoing human trials. These are COVXIN and ZyCoV-D. Covaxin is being developed by Bharat Biotech, Indian Council of Medical Research (ICMR), and National Institute of Virology, Pune.

కరోనా వాక్సీన్: మూడో దశ పరీక్షలకు ముహూర్తం ఖరారు

Posted: 08/19/2020 04:23 PM IST
Coronavirus vaccine update india begins phase 3 human trials of covid19 vaccine

యావత్ ప్రపంచ మానవాళిపై ప్రభావం చేపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే వాక్సీన్ తయారీలో నిమగ్నమయ్యాయి, కాగా, భారత్ లో అభివృద్ధి చెందుతున్న మూడు కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ ను ప్రారంభించిన ఈ సంస్థలు రెండో దశలోనూ సత్ఫలితాలను అందుకున్నాయి, ఈ నేపథ్యంలో మూడో దశ ప్రయోగాలు కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ముహుర్తాలను సంస్థలు రెడీ చేసుకున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో మూడవ దశ పరీక్షలకు చేరుకుంటాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని పాల్ చెప్పారు. అయితే అదివారం రోజున ఒకనాటి మిత్రవర్గమైన శివసేన కేంద్రాన్ని టార్గెట్ చేసి.. రష్యా సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ప్రధాని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర బాభీజీ పాపడాలను ప్రచారం చేయడం.. వట్టి మాటలను చెప్పడం తప్ప కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని సామ్నా పత్రిక ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో వీకే పాల్ కేంద్ర తరపున వాక్సీన్ నేపథ్యంలో జరుగుతున్న ప్రగతిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారని సమాచారం.

మరోవైపు సోమవారం దేశంలో అత్యధికంగా 9 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,09,41,264 పరీక్షలు జరిపినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 నుంచి 20.37 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు. కరోనా మరణాల రేటు కూడా 2 శాతం లోపే ఉందని, రాబోయే రోజుల్లో దీన్ని ఒక శాతానికి తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా మహమ్మారి నుంచి కోలుకున్న రోగుల్లో కోవిడ్‌ అనంతర లక్షణాలపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాగా, భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిల్లా, సీరం ఇనిస్టిట్యూట్‌లు కరోనా వైరస్‌ నిరోధానికి దేశీ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడం​లో తలమునకలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles